హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Google boy : రెండున్న ఏళ్ల వయసున్న గూగుల్‌ బాయ్ .. ఎంత టాలెంటెడో ఈ వీడియోలో చూడండి

Google boy : రెండున్న ఏళ్ల వయసున్న గూగుల్‌ బాయ్ .. ఎంత టాలెంటెడో ఈ వీడియోలో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Google boy: జ్ఞాపకశక్తి, తెలివి తేటల్లో కొందరు చిన్న పిల్లలు పెద్దలను మించిపోతున్నారు. సరిగ్గా మాటలు కూడా రాని వయసులో ఇంటర్‌నెట్ మాధ్యమం గూగల్‌ తరహాలో ప్రశ్న అడగగానే ఠక్కున సమాధానం చెబుతూ అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఓ బుడతడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Himachal Pradesh, India

జ్ఞాపకశక్తి, తెలివి తేటల్లో కొందరు చిన్న పిల్లలు పెద్దలను మించిపోతున్నారు. సరిగ్గా మాటలు కూడా రాని వయసులో ఇంటర్‌నెట్(Internet)మాధ్యమం గూగల్‌ తరహాలో ప్రశ్న అడగగానే ఠక్కున సమాధానం చెబుతూ అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఓ బుడతడు. హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)లో ఉన్న ఈ పిల్లవాడ్ని చూసి అందరూ గూగుల్‌ బాయ్‌(Googleboy)అని పిలుస్తున్నారు. పసివాడిగా ఉండానే ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్‌(Knowledge)ని సొంతం చేసుకుంటే ఇంకాస్త పెద్దవాడైతే కచ్చితంగా సివిల్ ర్యాంక్స్‌ సాధించి ఏ కలెక్టరో(Collector)లేక అబ్దుల్‌ కలాం(Abdul Kalam)అవుతాడని నెటిజన్లు

(Netizens)ప్రశంసిస్తున్నారు.

Lottery : ఒకే లాటరీకి 200 టికెట్ లు కొన్నాడు..16వేలు ఖర్చు పెట్టి రూ.8కోట్లు సంపాదించాడు

పసివాడు కాదు మహాజ్ఞాని..

కొందరూ పుట్టుకతోనే ఎంతో జ్ఞానం, తెలివి తేటలతో పుడతారు. మరికొందరూ పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకుంటారు. హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఓ రెండున్న సంవత్సరాల బాబును చూస్తే ఇప్పుడు అందరూ అదే చర్చించుకుంటున్నారు. నోట్లోంచి మాటలు కూడా సరిగా రాని వయసులో దేశంలోని ఏ రాష్ట్రం పేరు చెప్పి రాజధాని చెప్పమంటే ఠక్కున చెప్పేస్తాడు. షాడోల్‌ జిల్లాలోని కాంగ్రాలో నివసిస్తున్న దేవేష్‌ని స్థానికులు గూగుల్‌బాయ్ అని పేరు పెట్టారు. ఏదైనా చూసినా , చదివినా , లేదంటే చెబుతుంటే విన్నా ఇట్టే గుర్తు పెట్టుకోవడం ఆ పిల్లవాడి మేధాశక్తికి నిదర్శనం.

బాల మేధావి..

పుస్తకంలో కనిపించే వాటిని వరుసగా చదువుకుంటూ వెళ్లే దేవేష్ గ్లోబు చూపించి అందులో ఇండియా మ్యాప్ చూపించమంటే ఇట్టే చూపిస్తాడు. ఇతర దేశాలు, రాష్ట్రాల పేర్లతో పాటు ఆయా రాష్ట్రాల సీఎంల పేర్లను తడబడకుండా చెప్పేస్తున్నాడు. ప్రపంచంలోని దేశాల సంఖ్య, నెలల పేర్లు, రోజుల లెక్కింపుతో పాటుగా లెక్కలే కాదు పౌరాణిక, చారిత్రక అంశాలపై కూడా ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెబుతూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.

China Police Posts : ప్రపంచవ్యాప్తంగా చైనా పోలీస్ స్టేషన్ లు..ఇప్పటికే 21 దేశాల్లో ఏర్పాటు

కలాం అంతటి వాడు అవుతాడు...

ఈరెండున్నర సంవత్సరాల బాలుడి తండ్రి కరోనా టైమ్‌లోనే కన్నుమూశాడు. దాంతో కుటుంబ సభ్యులే దేవేష్‌కి కావాల్సిన పుస్తకాలు, ఇతర విషయాలను తెలుసుకోవాలనే అవగాహన ఉండటం, అడిగిన విషయాలపై సమాధానం చెప్పడం చూసి అతని టాలెంట్‌ని గుర్తించారు. అందుకే ఆ పిల్లవాడికి గూగుల్‌ బాయ్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇప్పుడే ఈ స్థాయిలో నాలెడ్జ్ ప్రదర్శిస్తున్న దేవేష్‌ భవిష్యత్తులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంత పెద్ద మేధావి అవుతాడని అందరూ చర్చించుకుంటున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Himachal Pradesh, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు