ఒకప్పుడు పోలీస్ స్టేషన్(Police station)మెట్లెక్కాలన్నా ..పోలీసు వాళ్లను చూసినా ప్రతి ఒక్కరూ భయపడే వాళ్లు. ఏదైనా నేరం చూసినా లేక తమకు ఏదైనా అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలంటే మనకెందుకులే అనుకుని సర్దుకుపోయే వాళ్లు. కాని ఇప్పుడు జనరేషన్‌తో పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో అయితే ఇంకా విడ్డూరం ఏమిటంటే రెండేళ్ల బాలుడు(Two year old boy)పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు సమస్యను వివరించి న్యాయం చేయమని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. రెండేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఎవరిపైనో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ చిన్నారి ఫిర్యాదు చేసిన వీడియో(Video)నే ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
పోలీస్ కేసు పెట్టిన రెండేళ్ల బాలుడు..
చిన్నపిల్లలు నేరాలు చేయడం చూశాం. నేరాలు చేసిన వాళ్లను గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. చివరకు తమకు అన్యాయం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కేసులు ఉన్నాయి. కాని మధ్యప్రదేశ్‌లో కనీసం మాటలు కూడా పూర్తిగా రాని రెండేళ్ల సద్దాం అనే బాలుడి వ్యవహారించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది. బుర్హాన్ప్ూర్లోని ఖక్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెడ్తలై గ్రామానికి చెందిన రెండేళ్ల బుడతడే సద్దాం. ఇంట్లో అమ్మ తిట్టిందనే కోపంతో ఏకంగా ఇంటికి సమీపంలో ఉన్న డెడ్తలై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ డ్యూటీలో ఉన్న లేడీ ఎస్ఐ ప్రియాంక నాయక్‌కు ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పాడు. తనను తల్లి మందలించిందని ఆమెపై ఫిర్యాదు నమోదు చేయమని కోరాడు. మా అమ్మను శిక్షించండి అంటూ కోపంతో తెలిసి, తెలియని వయసులో మాట్లాడుతున్న మాటలను విని ఆశ్చర్యపోయింది లేడీ ఎస్ఐ.
తల్లిపైనే కొడుకు ఫిర్యాదు..
అయితే సద్దాం మాటలతో ముచ్చటపడిపోయిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక నాయక్ పోలీస్ వ్యవస్థపై, పోలీసులపై పిల్లాడికి నమ్మకం కలిగించాలని కంప్లైంట్ తీసుకుంటున్నట్లుగా అతను చెప్పిన విషయాల్ని ఓ పేపర్‌పై తానే స్వయంగా రాసింది. అంతే కాదు తల్లి మందలింపుతో చిన్నబుచ్చుకున్న పిల్లాడి మనసును అర్ధం చేసుకొని కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది ఎస్ఐ ప్రియాంక నాయక్.
వైరల్ అవుతున్న వీడియో...
అనంతరం చిన్నారి సద్దాం ద్వారా తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని వారికి కబురు చేసి స్టేషన్‌కు పిలిపించి అతడ్ని అప్పగించారు. చిన్న పిల్లల మనసు సున్నితంగా ఉంటాయని వాళ్ల మనసులు నొప్పించకుండా చూసుకోమని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఎస్ఐతో బాలుడు కంప్లైంట్ చేసేందుకు వచ్చిన సందర్భంలో స్టేషన్లో ఉన్న మరో పోలీస్ వాళ్లిద్దరి మధ్య సంభాషణను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Trending news, VIRAL NEWS