హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : అట్లుంటది మన ఆడోళ్ల ఫైటింగ్..నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

Viral Video : అట్లుంటది మన ఆడోళ్ల ఫైటింగ్..నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

కొట్టుకుంటున్న మహిళలు

కొట్టుకుంటున్న మహిళలు

వీధిలో కొట్టకోవడం, దుర్భాషలాడటంకి సంబంధించి సోషల్ మీడియాలో మీరు అనేక వీడియోలను చూసి ఉంటారు. అయితే ఇది భిన్నమైనది. ఇక్కడ ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవను చూసేందుకు జనం రోడ్డుపైకి వచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వీధిలో కొట్టకోవడం, దుర్భాషలాడటంకి సంబంధించి సోషల్ మీడియాలో మీరు అనేక వీడియోలను చూసి ఉంటారు. అయితే ఇది భిన్నమైనది. ఇక్కడ ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవను(Two women fighting) చూసేందుకు జనం రోడ్డుపైకి వచ్చారు. టోల్‌ ఫీజు చెల్లింపు అంశంలో గొడవ జరిగి ఇద్ద‌రు మ‌హిళ‌లు బూతులు తిట్టుకుంటూ ఒక‌రి జుట్టు మ‌రొక‌రు ప‌ట్టుకుని మ‌రీ కొట్టుకున్నారు. వీరిలో ఒకరు టోల్ ప్లాజా ఉద్యోగి కాగా, మరొకరు ప్రయాణీకురాలు. ఈ సంఘ‌ట‌న మహారాష్ట్ర(Maharashtra)రాష్ట్రంలోని నాసిక్‌(Nasik)లోని పింపాల్‌గావ్ టోల్ ప్లాజా దగ్గర చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరి మహిళల ఫైటింగ్‌ను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌(Viral Video) అయ్యింది.

Embrassing photos : ఫొటో పోస్ట్ చేశారు..బ్యాక్ గ్రౌండ్ మరిచారు..10 వైరల్ ఫొటోలు

బుధవారం నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ గేట్‌ వద్దకు ఒక కారు వచ్చింది. అయితే టోల్‌ రుసుం చెల్లింపు విషయంలో టోలో ప్లాజా ఉద్యోగినికి,కారులో ఉన్న మహిళకు మధ్య వివాదం జరిగింది. చివరకు ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు బాహాబాహికి దిగారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని తోసుకున్నారు. మరాఠీలో అసభ్యంగా తిట్టుకోవడంలోపాటు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరి మహిళల ఫైటింగ్‌ను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇద్దరు మహిళలు ఒకరినొకరు పదే పదే కొట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం వంటి దృశ్యాలు వైరల్ వీడియోలో క‌నిపించాయి. ఇద్దరు మహిళలలో ఒకరు మాటల వాగ్వాదం మధ్య చీరను చింపివేస్తానిని బెదిరించడం కూడా వీడియోలో కనబడుతోంది. అయితే స్పాట్ లో ఉన్న టోల్ ప్లాజా ఉద్యోగులు,పోలీసులు కొంతసేపు ఇద్దరి మహిళల గొడవను కళ్లప్పగించి చూశారు. ఆ తర్వాత జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసి పక్కకు తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Maharashtra, Viral Video, Women

ఉత్తమ కథలు