హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

జుట్లు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియో..

జుట్లు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియో..

కొట్టుకుంటున్న అమ్మాయిలు

కొట్టుకుంటున్న అమ్మాయిలు

Viral video:  ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీదకు చేరుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై మరోకరు జుట్లు పట్టుకుని మరీ దాడులు చేసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

సోషల్ మీడియాలో (Social media)  ఇప్పటి వరకు పెళ్లికి సంబంధించిన వీడియో లు ఎక్కువగా వైరల్ గా మారాయి. పెళ్లిలో జరిగే వెరైటీ సంఘటనల కారణంగా ఆ పెళ్లి కాస్త వార్తలలో నిలిచింది. అయితే.. దాని తర్వాత స్థానంలో ఈ మధ్య ఎక్కువగా అమ్మాయిలు కొట్టుకున్న ఘటనలు అనేకం వార్తలలో ఉంటున్నాయి. ఇప్పటికే మహిళలు తప్పతాగి, లవర్ విషయంలో రోడ్డుమీదకు వచ్చి మరోక యువతితో గొడవ పడిన అనేక సంఘటనలు వైరల్ గా (Viral video) మారాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన ట్రెండింగ్ మారింది.

పూర్తి వివరాలు.. ఇద్దరు అమ్మాయిలు స్కర్ట్ ధరించి ఉన్నారు. కారణమేంటో కానీ.. రోడ్డు మీదకు వచ్చి పిచ్చిపిచ్చిగా కొట్టుకుంటున్నారు. ఏ ఒక్కరు తగ్గటం లేదు. ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. మగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, ఇద్దరు గొడవలు పడుతున్నారు. జుట్లు లాక్కుంటున్నారు.

పొట్టపై పంచ్ లతో విరుచుకుపడుతున్నారు. అంతే కాకుండా.. కాళ్లతో తన్నుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా గుజరాత్ లోని (Gujarat)  గర్భా నృత్యం ఫెమస్ అనే విషయం మనకు తెలిసిందే.

అయితే... అక్కడ అహ్మదాబాద్ లోని పాతబస్తీలో పురుషులు నవరాత్రి వేడుకలు రాగానే చీరలు కట్టుకుని మరీ గర్భాడ్యాన్స్ చేస్తారు. అయితే.. అక్కడ నవరాత్రి వేడుకలలో ఎనిమిదవ రోజున బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీనివెనుక ఒక పురాణ గాథ ఉంది. కాగా, సదుబా అనే మహిళ తన బిడ్డను, ఎవరో పురుషుడి వలన పొగొట్టుకుంది. దీంతో ఆమె పురుషులకు శాపం పెట్టింది. దీంతో అక్కడి వారు.. సదుబా చనిపోయాక ఆమెకు గుడికట్టించారు.

అంతే కాకుండా... ఆలయాన్ని సందర్శించే పురుషులు తప్పినసరిగా చీరలు ధరించి వెళ్లాలి. అక్కడు పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెకు క్షమాపణ కోరతారు. ఈ సంప్రదాయం 200 ఏళ్ల నాటిదని నమ్ముతారు 200 సంవత్సరాల క్రితం తమను శపించిన సదుబా నుండి పురుషులు క్షమాపణ కోరతారు. అష్టమి రోజున, నగరం నలుమూలల నుండి వందలాది మంది బారోట్ కమ్యూనిటీకి చెందిన వారు సాదు మాతా ని పోల్ వద్ద సదు మాతకు తమ నమస్కారాలు చెల్లించడానికి సమావేశమవుతారు. అక్కడ చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది. నవదుర్గ ఆరాధనకు అంకితం చేయబడిన నవరాత్రులు సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తాయి. నవరాత్రులు మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Social Media, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు