Shocking Video: స్వింగ్ రైడ్.. 6,300 అడుగుల ఎత్తు‌ నుంచి పడిపోయిన మహిళలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

(Image-Twitter)

సరదా కోసం సాహసాలు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

  • Share this:
    సరదా కోసం సాహసాలు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వేలల్లో వీడియోలు ఉన్నాయి. తాజాగా సరదాగా కోసం ఇద్దరు మహిళలు చేసిన స్వింగ్ రైడ్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఎందుకంటే వారు స్వింగ్ రైడ్ చేస్తూ 6,300 అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డారు. 46 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో.. ఇద్దరు మహిళలు 6,300 ఎత్తులో ఉణ్న కొండ చివర నుంచి స్వింగ్ రైడ్ చేయడం చూడవచ్చు. ఎలాంటి సెఫ్టీ లేకుండానే ఇద్దరు మహిళలు కొండ అంచున ఏర్పాటు చేయబడిన ఊయలలో కూర్చొన్నారు. వారి ఊయలను అక్కడున్న వ్యక్తి వెనక్కి లాగి వదులడం కనిపించింది. ఇలా మూడు, నాలుగు సార్లు వారు ముందుకు వెళ్లి.. ఎత్తైన ప్రదేశంలో స్వింగ్ రైడ్‌ను ఎంజాయ్ చేశారు. అయితే అంతలోనే ఊయల వెనక్కి రావడం.. దాని గొలుసులు ఉడిపోవడం జరిగింది. దీంతో ఊయల పూర్తిగా ఒక వైపుకు వంగిపోయింది. దీంతో వారిద్దరు 6,300 అడుగుల ఎత్తు ఉన్న కొండ నుంచి జారిపోయారు. ఈ ఘటన రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్టాన్‌లోని సులక్ కాన్యన్‌లో చోటుచేసుకుంది.

    అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో అంత ఎత్తు నుంచి జారిపడిన ఇద్దరు మహిళలకు ఏమైందనే ఆసక్తి నెలకొంది. చాలా మంది వాళ్లిద్దరు చనిపోయి ఉంటారని భావించారు. అయితే ఇద్దరు మహిళలు కూడా స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని Daily Mail పేర్కొంది.

    ఇద్దరు మహిళలు.. జారిపోయినప్పుడు నేరుగా కిందపడిపోకుండా, కొండ అంచుకు కొన్ని అడుగుల దిగువన ఒక్క చెక్కపై పడటంతో వారు ప్రాణాలు దక్కించుకున్నారు. వారికి చిన్నపటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఆ తర్వాత వారిని కుటుంబ సభ్యులు, అక్కడున్నవారు సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో ఇద్దరు మహిళు భయపడ్డారని Komsomolskaya Pravda వార్తపత్రిక తెలిపింది. ఇక, వారిద్దరు ఉన్న ఊయల.. లోయపైకి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగితే వారు ప్రాణాలు కోల్పోయి ఉండేవారిన అక్కడున్నవారు చెప్పారు. ఇది ఊహించుకోవడానికే భయంకరమైనదని వారు అన్నారు.





    భద్రతా ప్రమాణాలు పాటించలేదని.. అందువల్లే ప్రమాదం జరిగిందని స్థానిక పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. ఇక, ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వింగ్ రైడ్ ప్రదేశాలపై తనిఖీలు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: