Viral Video: 6,300 అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డ మహిళలు... తర్వాత ఏమైందంటే.. వీడియో వైరల్

6,300 అడుగుల ఎత్తు నుంచి పడిన మహిళలు

ఏదైనా థ్రిల్లింగ్ చేయాలనిపిస్తే అది ఖచ్చితంగా ప్రాణాలమీదకు తెస్తుంది. అలా ట్రై చేసిన ఇద్దరు మహిళలు చావు అంచుల వరకు వెళ్లొచ్చారు.

  • Share this:
సరదాగా చేసే విన్యాసాలు ప్రాణాలు పోయే పరిస్థితులకు దారితీస్తాయని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ప్రతిరోజూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ కొందరు మాత్రం ప్రాణహాని తలపెట్టే విన్యాసాలు సైతం చేయడానికి సిద్ధపడి చివరికి పశ్చాత్తాప పడుతుంటారు. తాజాగా ఇద్దరు రష్యన్ దేశస్తులు కూడా అత్యంత ప్రమాదంతో కూడిన విన్యాసం చేసి చావు వరకు వెళ్లి వచ్చారు. కొంచెం తేడా వచ్చినా వారి ప్రాణాలు ఈ పాటికే గాల్లో కలిసిపోయేవి. వివరాల్లోకి వెళ్తే... రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డగేస్టన్ లోని కాస్పియన్‌ సముద్రం వద్ద కాన్యాన్ పర్యాటక ప్రాంతంలో 6,300 అడుగుల ఎత్తున ఒక కొండ అంచున ఊయల ఏర్పాటు చేశారు. ఆ ఊయలకు, కొండ అంచుకు మధ్య దూరం కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమే ఉంది. ఈ ఊయలలో కూర్చుని ఊగటమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. ఉయ్యాలలో కూర్చుని ఊగుతుంటే కొండ పైనుంచి కింద పడినట్లే ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది.

కానీ దురదృష్టవశాత్తు పట్టు తప్పితే.. చనిపోవడం తథ్యం. ఊయల గొలుసులు తెగినా.. ప్రాణాలు హరీ అనడం ఖాయం. కానీ ఇద్దరు రష్యన్ మహిళలు మాత్రం ఊయల ఊగి ఎంజాయ్ చేద్దామని ఆలోచించారే తప్ప రాబోయే ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. మొదట వీరిద్దరూ కొండ అంచున ఉన్న ఊయలలో కూర్చున్నారు. ఒక వ్యక్తి ఊయలను వెనుక నుంచి బలంగా ఊపటం ప్రారంభించారు. అప్పటికే ఆ మహిళలు భయంతో కేకలు పెట్టడం ప్రారంభించారు. పది సెకన్ల పాటు ఉయ్యాలలో బాగానే ఊగారు కానీ ఆ తర్వాత ఉయ్యాలకు కట్టిన ఒక గొలుసు తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా వారిద్దరూ ఊయల నుంచి జారి కిందపడిపోయారు.


మొసలిని దొంగలించిన తింగరి కుర్రాడు.. కానీ అతడు చెప్పిన కారణం వింటే..


అక్కడున్న టూరిస్టులంతా ఈ సీన్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మహిళలు కొండపై నుంచి కిందపడి చనిపోయారని అందరూ భావించారు. కానీ అదృష్టవశాత్తు టూరిజం అధికారులు కొండ అంచున ఏర్పాటుచేసిన డెక్కింగ్ ప్లాట్ ఫాంపై పడి ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి వారు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.

ఇది చదవండి: కూర వండేందుకు గుడ్లు ఉడకబెట్టిన మహిళలు… కాసేపటి తర్వాత షాకింగ్ సీన్… ఏం జరిగిందంటే…!


ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యింది. వాళ్లిద్దరూ ఊయల నుంచి జారిపడిన దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మహిళలు అంత ఎత్తు నుంచి కింద పడిన దృశ్యాలను చూస్తుంటే గుండె ఆగుతుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో స్థానిక టూరిజం అధికారులు, పోలీసులు అక్కడి ఊయలకు భద్రతా ప్రమాణాలు లేవని గుర్తించి.. తక్షణమే దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
Published by:Purna Chandra
First published: