విషాదం.. పిడుగుపడి ఇద్దరు క్రికెటర్ల మృతి!

పిడుగు పడి ఇద్దరు టీనేజ్‌ క్రికెటర్లు మృతిచెందారు. బంగ్లాదేశ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. భావీతరం క్రికెటర్ల ఆకస్మక మరణం అక్కడి క్రీడాలోకాన్ని ద్రిగ్భాంతికి గురెచేసింది.


Updated: September 11, 2020, 1:47 PM IST
విషాదం.. పిడుగుపడి ఇద్దరు క్రికెటర్ల మృతి!
ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.
  • Share this:
పిడుగు పడి ఇద్దరు టీనేజ్‌ క్రికెటర్లు మృతిచెందారు. బంగ్లాదేశ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. భావీతరం క్రికెటర్ల ఆకస్మక మరణం  అక్కడి క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురెచేసింది. మహ్మద్ నదీమ్, మిజనుర్ రెహ్మాన్ అనే ఇద్దరూ యువ క్రికెటర్లు గురువారం  స్థానిక మైదానంలో జరగుతున్నప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో వర్షం పడడంతో సాధనకు బ్రేక్ పడింది.  దీంతో వారు సరదాగా గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడారు. ఆ సమయంలో ఒక్కసారిగా వారిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించారు.

బంగ్లాదేశ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న వారిపై పకృతి ప్రకోపానికి బలయ్యారని ఆవేదన  వ్యక్తం చేశారు కోచ్ అన్వర్ హుస్సెన్. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని వాపోయారు. పిడుగుపాటుతో ఆ దేశంలో వేలాది మంది ప్రతి ఏటా ప్రాణాలు కొల్పోతునే ఉన్నారు. సుమారుగా 350 మంది ప్రతి ఏటా ప్రాణాలు కోల్పోతునే ఉన్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 11, 2020, 1:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading