TWO SIBLINGS FROM ASSAM TO WRITE LETTERS TO PRIME MINISTER NARENDRA MODI AND STATE CHIEF MINISTER HIMANTA BISWA SARMA FOR THIS PROBLEM GH SRD
Viral News: ముఖ్యమంత్రి, ప్రధాని మోదీకి అక్కాతమ్ముళ్ల లేఖ.. వారి సమస్య ఏంటో తెలిస్తే షాకే..!
Photo Credit : Instagram
Viral News: ఇటీవల కాలంలో బాలబాలికలు తమ సమస్యల గురించి పీఎం, సీఎంలకు లేఖలు రాస్తూ వార్తలకెక్కుతున్నారు. వారి సమస్యలు కొన్ని నిజమైనవిగా, కొన్ని హాస్యాస్పదంగా ఉంటున్నాయి. తాజాగా సీఎం, పీఎంలకు ఒక ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేసిన ఇద్దరు చిన్నారుల సమస్యల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!
ఇటీవల కాలంలో బాలబాలికలు తమ సమస్యల గురించి పీఎం, సీఎంలకు లేఖలు రాస్తూ వార్తలకెక్కుతున్నారు. వారి సమస్యలు కొన్ని నిజమైనవిగా, కొన్ని హాస్యాస్పదంగా ఉంటున్నాయి. తాజాగా సీఎం, పీఎంలకు ఒక ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేసిన ఇద్దరు చిన్నారుల సమస్యల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే! అస్సాం రాష్ట్రానికి చెందిన అక్కాతమ్ముళ్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు లేఖలు రాశారు. తమకు వయోజన దంతాలు సరిగా పెరగట్లేదని ఆ లేఖల్లో అక్కాతమ్ముళ్లు పేర్కొన్నారు.ఆరేళ్ల రవ్జా (Rawza), ఆమె 5 ఏళ్ల సోదరుడు ఆర్యన్ తమ వయోజన లేదా శాశ్వత దంతాలు (adult teeth) చాలా ఆలస్యంగా పెరుగుతున్నాయని లేఖలో ఫిర్యాదు చేశారు. తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను నమల లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ లేఖలను వారి మావయ్య తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశాడు. కాగా అవి ఇప్పుడు నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
అస్సాంకి చెందిన ఈ ఇద్దరు పిల్లలకి కొంత కాలం క్రితం బాల దంతాలు/ పాల పళ్లు రాలిపోయాయి. ఆ తరువాత పుట్టుకొచ్చిన వయోజన దంతాలు (adult teeth) పెరగడానికి చాలా సమయం పడుతోంది. దీనితో వారు తమ సమస్యను పీఎం, సీఎం వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ పళ్లు పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ వారిని అభ్యర్థించారు.
వారి మావయ్య ఈ లేఖలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట షేర్ చేసి.. “హిమంత బిశ్వ శర్మ, నరేంద్ర మోదీ గారికి ... నా మేనకోడలు రవ్జా, మేనల్లుడు ఆర్యన్ సొంతంగా ఈ లేఖలు రాశారు. దయచేసి ఇష్టమైన ఆహారాన్ని తినేందుకు వారికి సాయం చేయండి" అని ఓ క్యాప్షన్ జోడించాడు.
“ప్రియమైన హిమంత మామా (మామయ్య) కి... నాకు ఐదు వయోజన దంతాలు ఇంకా పెరగడం లేదు. దంతాలు రాకపోవడం వల్ల నాకు ఇష్టమైన ఆహారాన్ని నమల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అందుకే తగిన చర్యలు తీసుకోండి" అని సీఎం హిమంతకు రాసిన లేఖలో రవ్జా పేర్కొంది.
“ప్రియమైన మోదీజీకి.. నాకు మూడు వయోజన దంతాలు రావడం లేదు. దీంతో నాకు ఇష్టమైన ఆహారాన్ని నమల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. దీనిపై తగిన చర్యలు తీసుకొని మాకు సాయం చేయండి" అని మరొక లేఖను ఆర్యన్ ప్రధాని మోదీకి రాశాడు.
ఈ లేఖలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సో, క్యూట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా మరి కొందరు వారి అమాయకత్వానికి ముచ్చట పడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.