జమ్మూకశ్మీర్ ప్రజల హృదయాలు గెలుచుకున్న భారత జవాన్లు..

తావి నదిలో చిక్కుకున్న కార్మికులు

Jammu Kashmir Tawi river: జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వరదలతో తావి నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్దకు వరదలు ఒక్కసారిగా పోటెత్తాయి.

  • Share this:
    జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వరదలతో తావి నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్దకు వరదలు ఒక్కసారిగా పోటెత్తాయి. అయితే, ఆ సమయంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్నారు. వరదలు మరింత ఉధృతం కాకముందే వారిద్దరు ఓ ఎత్తైన కాంక్రీటు స్లాబ్‌పైకి చేరుకున్నారు. ఇది పసిగట్టిన వాయుసేన.. హెలికాప్టర్ సహాయంతో ఓ సైనికుడిని కిందకి దించారు. ఆ సైనికుడు వెంటవెంటనే వారిద్దరికి తాడును బిగించి సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. అనంతరం సైనికుడు కూడా సురక్షిత ప్రాంతానికి చేరాడు. దీనికి సంబంధించిన లైవ్ వీడియోను అన్ని ఛానళ్లు లైవ్‌గా ప్రసారం చేశాయి.

    కాగా, వాయుసేన ధైర్య సాహసాలను మెచ్చిన జమ్మూకశ్మీర్ ప్రజలు సైనికులను కొనియాడారు. కేవలం 30 నిమిషాల్లోనే కార్మికులను రక్షించారని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

    First published: