ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా చోట్ల విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సహజంగా పెళ్లి వేడుకల్లో ఏర్పాట్లు, పెళ్లిపోతల విషయంలో అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. లేదంటే కట్న, కానుకల విషయంలో గొడవపడతారు. జార్ఖాండ్ (jharkhand)లో మాత్రం ఇందుకు పూర్తిగా రివర్స్ జరిగింది. పెళ్లి చూడటానికి వచ్చిన బంధువుల వల్ల భారీ ఫైటింగ్ జరిగింది. అమ్మాయి తరపు బంధువుల దగ్గర మొదలైన రచ్చ..ఇరువర్గాలు పౌరుషంగా మాట్లాడుకోవడం దగ్గర నుంచి ఇటుకలు (Bricks),రాళ్లు(Stones), కర్రల(Sticks)తో కొట్టుకునే వరకు వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. గిరిదిహ్(Giridih)జిల్లాలోని జమువా బ్లాక్ పరిధిలో మీర్జాగంజ్ (Mirzaganj)లో ఉన్న మత్స్యకారుల సూర్యదేవాలయానికి సంబంధించిన వివాహ వేడుకులు జరిగే మండపంలో గొడవ జరిగింది. గొడవ ఎందుకు జరిగిందో తెలుసా. పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో ఫోటో(Photo)దిగే విషయంలో గొడపడ్డారు. పెళ్లి వేడుకను చూసి వధువరులను ఆశీర్వదించడానికి జీప్‌లు(Jeep), తుఫాన్ వాహనాల్లో(Vehicles) వచ్చిన వాళ్లంతా ఆఫ్ట్రాల్ ఫోటో కోసం తలకాయలు పగిలేలా కొట్టుకున్నారు. ముందు మేం ఫోటో దిగుతామంటే లేదు మేం దిగాల్సిందేనంటూ అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు పోటీ పడ్డారు. అక్కడే వివాదం రాజుకుంది. ముందు ఆడవాళ్ల దగ్గర మొదలైన ఫైటింగ్ చివరకు మగవాళ్లు తన్నుకునే వరకు వచ్చింది. పెళ్లిలో ఫోటో కోసం ఇరువర్గాలు కొట్టుకుంటుంటే స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
ఫోటో కోసం కొట్టాట..
బంధు, మిత్రుల సమక్షంలో అంతా అట్టహాసంగా వివాహం జరుగుతున్నసమయంలో ఫోటో చిచ్చు అగ్గిరాజేసింది. ఒకరిద్దరు కాదు అక్కడికి వచ్చిన వాళ్లంతో ఏది దొరికితే దాంతో విసురుకున్నారు. ఇటుకల నుంచి రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఆడవాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. ప్రశాంతంగా జరగాల్సిన పెళ్లి వేడుక కాస్తా ఫోటోల కారణంగా ఉద్రిక్తత వాతవరణానికి దారి తీసింది.
పెళ్లిలో ఫైటింగ్..
పెళ్లి కొడుకు పక్షం గిరిదిహ్‌లోని ధన్వర్ బ్లాక్‌కు చెందిన వాడు. పెళ్లి కూతురు బీహార్‌లోని సరన్ ప్రాంతానికి చెందిన యువతిగా అక్కడికి వచ్చిన పెళ్లి వాళ్లు తెలిపారు. ఎక్కడ చూసినా గుంపు, గుంపులుగా జనం కనిపించడంతో స్థానికులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి వచ్చి ఘర్షణ పడిన వారికి గ్రామస్తులు సర్ది చెప్పారు. ప్రశాంతంగా జరగాల్సిన పెళ్లి వేడుక దగ్గర ఇలా గొడవపడటం సరికాదని అమ్మాయి, అబ్బాయి తరపు బంధువుల్ని వివాహం జరుగుతున్న కల్యాణ మండపంలోకి పంపడంతో గొడవ సద్దుమణిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.