Home /News /trending /

TWO OF MY CHILDREN DIED IN FRONT OF MY EYES MAHARASHTRA CM EKNATH SHINDE BREAKS DOWN IN ASSEMBLY PAH

‘నా కళ్ల ముందే ఇద్దరు పిల్లలు చనిపోయారు’.. తొలిరోజే అసెంబ్లీలో శివసేన పై విరుచుకుపడ్డ సీఎం ఏక్‌నాథ్ షిండే..

సభలో ఏక్ నాథ్ షిండే

సభలో ఏక్ నాథ్ షిండే

Maharashtra: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భావోద్వేగానికి లోనయ్యారు. సోమవారం మహా సీఎంగా తొలిసారి అసెంబ్లీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన శివసేనపై విరుచుకుపడ్డారు.

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో శివసేన నుంచి కెబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath shinde)  తిరుగు బాటు బావుట ఎగుర వేసి, హైడ్రామాకు తెరలేపారు. దీంతో ఆయన వెంట అనేక మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో అనేక పరిణామాలు జరిగాక చివరకు బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని ఏక్ నాథ్ షిండే అధిష్టించారు. కాగా, సోమవారం తొలిసారి అసెంబ్లీలో (Assembly meeting) ఏక్ నాథ్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో కొంత భావోద్వేగానికి గురయ్యారు. శివసేనపై (shivsena)  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను.. ఉద్ధవ్ ఠాక్రేపై (uddhav thackeray) తిరుగుబాటు చేసినప్పుడు తన కుటుంబ సభ్యులకు అనేక మంది బెదిరించారని అన్నారు. అయితే, దీన్ని తాను పట్టించుకోలేదని అన్నారు.

నా కళ్ల ముందే తన ఇద్దరు పిల్లలను ఎలా పోగొట్టుకున్న ఘటనను, కష్ట సమయాల్లో శివసేన నాయకుడు దివంగత ఆనంద్ డిఘే ఎలా మద్దతు ఇచ్చారో వివరించారు. ‘‘నా కళ్ల ముందే ఇద్దరు పిల్లలు చనిపోయారు.. ఆ సమయంలో ఆనంద్ దిగే నన్ను ఆదరించారు.. నా కుటుంబం బాధతో చితికిపోయింది.. ఎందుకు బతకాలి.. ఎవరి కోసం?.. కానీ .. నా భార్య, తల్లిదండ్రుల కోసం, ప్రజలకు మంచి చేయడానికి బతకాలని నిర్ణయించుకున్నాను. ప్రజలకు నా అవసరం ఉందని నేను గ్రహించాను. నేను మీ సంస్థ కోసం పని చేయలేనని డిఘే సాహెబ్‌తో చెప్పాను. నేను నా కుటుంబం కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం పని చేస్తానని అతను నాకు చెప్పాడు, ”అని కన్నీళ్లు పెట్టుకున్న షిండే సభలో చెప్పారు.





షిండే పెద్ద కుమారుడు ఎంపీగా ఉండగా, అతని ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు(11) , ఒక కుమార్తె (7) వారి గ్రామానికి పర్యటన సందర్భంగా వచ్చారు. అప్పుడు అనుకోకుండా.. నదిలో పడవ బోల్తా పడటంతో వారు మరణించారు.అంతటి బాధను దిగమింగుకోని తాను బయటకొచ్చానని అన్నారు. శివసేన అగ్రనాయకత్వం తనను అణచివేసే ప్రయత్ననం చేసిందని షిండే పేర్కొన్నారు.



సభలో తన ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకున్న తర్వాత షిండే మాట్లాడుతూ, షిండే సీఎం కావడాన్ని శివసేనలోని వ్యక్తులే వ్యతిరేకిస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సిఎం అజిత్ పవార్ తనకు తెలియజేశారని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరి రోజున 164 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, వ్యతిరేకంగా 99 మంది ఓటు వేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Eknath Shinde, Maharashtra, Uddhav Thackeray

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు