Viral Video : సింగిల్ గా ఉన్న గేదెపై సింహాల దాడి.. కానీ, చివరికి జరిగింది అస్సలు ఊహించలేరు..

ప్రతీకాత్మక చిత్రం

Viral Video : సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం సహజమే. ఇక అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. సింహం అధిపత్యం అలాంటిది మరి.

 • Share this:
  వింతలు-విశేషాలకు సోషల్ మీడియా (Social Media) నిలయం. ప్రపంచం నలమూలల (World Wide) ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు ఆకట్టుకుంటాయ్. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సమయం దొరకని వారు సోషల్ మీడియాలో జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని గడుపుతారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే. వాస్తవానికి, చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. అవి చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం సహజమే. ఇక అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. సింహం అధిపత్యం అలాంటిది మరి.

  అసలు వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఓ గేదెపై సింహం దాడి చేసింది. అయితే ఇక్కడ మాత్రం దాని పప్పులు ఉడకలేదు. దాహం వేసి నీరుతాగడానికి వెళ్లిన ఓ గేదెను.. రెండు సింహాలు గమనిస్తూ ఉన్నాయి. అదును చూసి ఒక్కసారిగా దానిపై దూకాయి. ఊహించని ఘటనతో బెదిరిపోయిన గేదె.. కొద్ది సేపు తడబడ్డా, తర్వాత తిరగబడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా పోరాడింది.

  ప్రమాదంలో ఉన్న గేదెను చూసిన మిగతా గేదెలు.. ఒక్కసారిగా సీన్‌లోకి ఎంటరయ్యాయి. గుంపులు గుంపులుగా వచ్చిన గేదెలను చూసిన సింహాలు దడుసుకున్నాయి. ఒక సింహం ఎలాగోలా బయటపడింది. ఇంకో సింహం మాత్రం.. గేదెలకు చిక్కింది. ఇంకేముంది అన్ని గేదెలూ కలిసి ఆ సింహాన్ని చెడుగుడు ఆడుకున్నాయి. గాల్లోకి ఎగరేస్తూ.. కొమ్ములతో ఆడుకుని, చివరికి కాళ్లతో తొక్కి చంపేశాయి. పార్కులోకి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు.

  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫన్నీ వీడియోను తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

  మరో, వైరల్ వీడియోలో  అమ్మాయి పామును పెంచుకుంటుంది. అది మామూలు పాము కాదు.. భారీ కొడచిలువ. ఆ అమ్మాయి ఒడిలో ఆ పాము ఉండటం మనం కింద ఇచ్చిన  వీడియోలో గమనించవచ్చు.  ఆ కొండచిలువ తలను పట్టుకొని ఆ బాలిక ఉండటం మనం చూడవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు భయంతో.. ఆశ్చర్యపోతున్నారు.  ఎలాంటి భయం లేకుండా.. ఒక చేత్తో మొబైల్ ఆపరేట్ చేసుకుంటూ.. మరో చేత్తో కొండచిలువను తడుముతూ కనిపించింది ఆ మహిళ. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలిక తన ఇంటి వెలుపల కూర్చొని కనిపించింది. ఆ పాము ఇంటి ప్రాంగణంలో బహిరంగ ప్రదేశంలో పాకుతూ కనిపించింది ఆ భారీ కొండ చిలువ.  వైరల్ అవుతున్న ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో యువర్ నేచర్‌గ్రామ్ అనే అకౌంట్‌లో షేర్ చేయబడింది.
  Published by:Sridhar Reddy
  First published: