Home /News /trending /

TWO LIONESS ATTACKS FOREST KING LION BRUTALLY VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA AND NETIZENS HILARIOUS REPLIES SRD

Viral Video : అడవికి రాజైనా భార్య ముందు తలవంచాల్సిందే.. రెచ్చిపోతే ఇలానే మడతడిపోద్ది..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : సోషల్​ మీడియా విస్తృతితో ప్రపంచంలోని అనేక వింతలు, విశేషాలు మన కళ్ల ముందుకొస్తున్నాయి. కాస్త భిన్నంగా ఉంటే చాలు ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్​గా మారుతున్నాయి.

    వింతలు-విశేషాలకు సోషల్ మీడియా (Social Media) నిలయం. ప్రపంచం నలమూలల (World Wide) ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు ఆకట్టుకుంటాయ్. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సమయం దొరకని వారు సోషల్ మీడియాలో జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని గడుపుతారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే. వాస్తవానికి, చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. అవి చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం సహజమే. ఇక అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. సింహం అధిపత్యం అలాంటిది మరి. దాని గర్జన వినిపించినా కూడా మిగతా జంతువులు ఠక్కున దాక్కుంటాయి.

    మరి అంతటి బలశాలి అయిన సింహం మరో జంతువును చూసి భయపడుతుందా...? అలా భయపడితే ఎవరికి భయపడుతుందో తెలుసా..? అది ఎవరో కాదు సింహం భార్య. ఏ మగ సింహం అయినా కూడా ఆడ సింహాన్ని చూసి భయపడాల్సిందే. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

    ఇది కూడా చదవండి :  మనం రోజూ తాగే టీ గురించి మీకు తెలియని... ఆశ్చర్యపరిచే నిజాలు..!

    వైరల్ వీడియో ప్రకారం.. ఓ మగ సింహంపై రెండు ఆడ సింహాలు విరుచుకుపడినట్లు మీరు చూడవచ్చు. వాటి నుంచి మగ సింహం తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అయితే ఆడ సింహాలు మాత్రం దాన్ని వదల్లేదు. వెంటపడి మరీ కోపంతో దానిపై గర్జిస్తాయి. అసలు వాటి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ మగ సింహాన్ని.. ఆ రెండు ఆడ సింహాలు తరిమి తరిమికొట్టాయి.


    అయితే, 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ‘darksideofnature’ అనే ట్విట్టర్ పేజి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పటిదాకా ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో 1.5 వేల లైకులు రాబట్టింది. అడవికి రాజైనా.. భార్య ముందు తలవంచాల్సిందే అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇది వారి కుటుంబ సమస్య అనుకుంటా అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Lions, Trending videos, Viral Video, Viral Videos

    తదుపరి వార్తలు