• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • TWO LAHORE UNIVERSITY STUDENTS WERE EXPELLED AFTER A VIDEO OF A FEMALE STUDENT PROPOSING TO HER MALE CLASSMATE WENT VIRAL ON SOCIAL MEDIA SSR

Female Student Love Proposal: యూనివర్సిటీకి కోపం తెప్పించిన యువతి లవ్ ప్రపోజల్.. చివరికి జరిగిందేంటంటే..

Female Student Love Proposal: యూనివర్సిటీకి కోపం తెప్పించిన యువతి లవ్ ప్రపోజల్.. చివరికి జరిగిందేంటంటే..

యువకుడికి యువతి లవ్ ప్రపోజల్

కాలేజ్ లైఫ్ అంటే కొత్త బంధాలకు, సరికొత్త స్నేహాలకు నిలయం. ఈతరం యువత కాలేజ్ లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజీల్లో కొందరికి కొత్తకొత్త స్నేహితులు దొరికితే మరికొందరి విషయంలో మాత్రం సరికొత్త ప్రేమకథలు మొదలవుతాయి. ఆ ప్రేమను వ్యక్తపరిచేందుకు...

  • Share this:
    కాలేజ్ లైఫ్ అంటే కొత్త బంధాలకు, సరికొత్త స్నేహాలకు నిలయం. ఈతరం యువత కాలేజ్ లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజీల్లో కొందరికి కొత్తకొత్త స్నేహితులు దొరికితే మరికొందరి విషయంలో మాత్రం సరికొత్త ప్రేమకథలు మొదలవుతాయి. ఆ ప్రేమను వ్యక్తపరిచేందుకు కొందరు సంశయిస్తారు. మరికొందరు మాత్రం ఏమాత్రం బెరుకూభయం లేకుండా అసలు విషయం చెప్పేస్తారు. అయితే.. ఆ విషయం కాలేజీ బయటో, క్యాంటీన్‌లోనో చెప్పడానికే ప్రయత్నిస్తారు తప్ప కాలేజీలో అందరి ముందూ ప్రేమను వ్యక్తపరిచేందుకు చాలామంది జంకుతారు.

    కానీ.. పాకిస్తాన్‌లోని లాహోర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని మాత్రం తాను ప్రేమిస్తున్న విషయాన్ని అదే యూనివర్సిటీ ప్రాంగణంలో అందరి ముందూ ఆ అబ్బాయికి చెప్పేసింది. సినిమాటిక్‌గా అనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా జరిగింది ఇదే. ఇలాంటి సీన్లు సినిమాల్లో కనిపిస్తేనే యూత్ ఒకటికి రెండు సార్లు చూస్తుంటారు. అలాంటిది వాళ్ల కళ్ల ముందు జరిగితే ఊరుకుంటారా. ఆ విద్యార్థిని లవ్ ప్రపోజ్ చేసిన సమయంలో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో.. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఆ వీడియో వైరల్ కావడమే సదరు యువతీ, యువకుడి కొంప ముంచింది.

    ఆ యువతీ, యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం కాస్తా లాహోర్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ దృష్టికి వెళ్లింది. ఏంటీ పని అని ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఇద్దరికీ నోటీసులు పంపింది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. ఆ ప్రేమికులిద్దరూ నోటీసులను లెక్క చేయలేదు. క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరు కాలేదు. దీంతో.. యూనివర్సిటీ యాజమాన్యం కన్నెర్ర చేసింది. చెప్పినా లెక్కలేకుండా పోయిందన్నట్టుగా.. ఇద్దరినీ యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

    యూనివర్సిటీ పరిధిలోని ఏ క్యాంపస్‌లోకి వారిని రాకుండా నిషేధం విధించింది. యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ బహిరంగ లవ్ ప్రపోజల్‌కు మద్దతు తెలుపుతున్నారు. యూనివర్సిటీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. యూనివర్సిటీల్లో మోరల్ పోలీసింగ్ ఈరోజుల్లో సర్వ సాధారణంగా మారిందని.. విద్యార్థుల వ్యక్తిగత వ్యవహారంపై చర్యలు తీసుకోవడాన్ని కచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందని ‘ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ కలెక్టివ్’ ట్విట్టర్‌లో అభిప్రాయపడింది.
    Published by:Sambasiva Reddy
    First published: