Home /News /trending /

TWO KILLED IN TIRE BLAST IN RAIPUR CHHATTISGARH SNR

Live Blast: చత్తీస్‌గడ్‌లో టైర్‌లో గాలి నింపుతుంటే ఏం జరిగిందో ఈ వీడియో చూడండి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Live Blast:పని చేస్తున్న ధ్యాసలో పరికరం మర్చిపోయాడు. టైర్‌లో గాలి నింపుతూ ఎంత ఎక్కిందో చూసుకోకపోవడంతో ఇద్దరు బలయ్యారు. ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని స్టీల్‌ ఫ్యాక్టరీలో లైవ్ బ్లాస్ట్ వీడియో అందర్ని షాక్‌కి గురి చేస్తోంది.

కష్టజీవులకు ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుంది. అయితే కొందరు పని మీద ఏకాగ్రతతో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేరు. ఛత్తీస్‌గడ్‌(Chhattisgarh)లో అదే జరిగింది. స్టీల్‌ ఫ్యాక్టరీ(Steel factory)లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు టైర్‌లో గాలి నింపుతుండగా అది పేలడంతో ఒక్కసారిగా గాల్లో బంతిలా ఎగిరిపడ్డారు. ప్రమాదం జరిగిన అరక్షణంలోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. రాయ్‌పూర్‌(Raipur) పారిశ్రామిక వాడిలో జరిగిన లైవ్ బ్లాస్ట్(Live Blast)విజువల్స్‌ ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్నాయి. ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండస్ట్రీయల్‌ ఏరియా(Industrial‌ Area)లోని ధన్‌కుల్‌ ఐరన్ ఫ్యాక్టరీ(Dhankul Iron Factory)లో ఈప్రమాదం జరిగింది. జేసీబీ టైర్‌(JCB tire)లో గాలి నింపుతున్నాడు ఓ వ్యక్తి. అయితే అందులో గాలి ఎంత మేరకు నిండిందో టెస్ట్ చేసే పరికరం చేతిలో లేకపోవడంతో ఎక్కువగా గాలి నింపాడు. టైర్‌పై కూర్చొని పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న మరో వ్యక్తి అందులో గాలి సరిపోయిందో లేదో ఓ ఇనుప రాడ్‌తో కొట్టి చెక్ చేశాడు. తెలియకపోవడంతో ..అతను కూడా టైర్‌ దగ్గరకు వెళ్లి చూస్తుండగా టైర్‌లో గాలి ప్రెజర్‌ (Pressure)ఎక్కవై పేలిపోయింది. అంతే టైర్‌ పేలడం(Tire exploding)తో ఒక్కసారిగా ఇద్దరు యువకులు గాల్లో ఎగిరిపడ్డారు. సుమారు 10అడుగుల ఎత్తులో పైకి ఎగిరి కిందపడటంతో స్పాట్‌లో మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడున్న సీసీ కెమెరా(CCTV camera)లో రికార్డయ్యాయి. పెద్దగా శబ్ధం రావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఇద్దరు యువకులు విగతజీవుల్లో పడివుండటం చూసి షాక్ అయ్యారు.

లైవ్ బ్లాస్ట్..
రాయ్‌పూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా సీతాలత్రలోని ధన్‌కుల్ ఐరన్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. గాలిలో టైర్ నింపే ప్రయత్నంలో ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం స్ధానికంగా అందర్ని కలచి వేసింది. అప్పటి వరకు అదే ప్రదేశంలో నాలుగురు,ఐదుగురు వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. అందరూ ఉన్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేది. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా నుంచి వచ్చినట్లుగా తోటి ఉద్యోగులు తెలిపారు.

ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం..

మంగళవారం మధ్యాహ్నం ఈదుర్ఘటన జరిగింది. మధ్యాహ్నం సమయంలో కొందరు వ్యక్తులు స్టీల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అదే సమయానికి జేసీబీ టైర్‌లో గాలి నింపడం కోసం ఓ వ్యక్తి ప్రయత్నించాడు. చేతిలో ఎయిర్‌ చెకింగ్ మీటర్ లేకపోవడంతో పని ధ్యాసలో పడి గాలి పెడుతూనే ఉన్నాడు. ఓవర్ గాలి ఎక్కిస్తున్న విషయాన్ని గమనించలేకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Chatisghad, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు