TWO GROUPS OF SCHOOLGIRLS IN BENGALURU WERE CAUGHT ON VIDEO FIGHTING ON ST MARKS ROAD BENGALURU VIRAL IN SOCIAL MEDIA SK
Viral Video: నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న స్కూల్ గర్ల్స్.. బాయ్ ఫ్రెండ్ కోసమేనా?
నడిరోడ్డుపై కొట్టుకుంటున్న అమ్మాయిలు
Bengaluru school Girls Video: బెంగళూరులో స్కూల్ గర్ల్స్ కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చెలరేగిపోయారు. పరస్పరం జట్టుపట్టి లాక్కుంటూ.. పిడిగుద్దులు కురిపించకుంటూ.. చితకబాదుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందరూ స్కూల్ పిల్లలే. ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. కొందరు యూనిఫామ్‌లో ఉంటే.. మరికొందరు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. ఏమైందో ఏమో.. నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పెద్ద పెద్దగా అరుస్తూ.. తిట్టుకుంటూ.. కర్రలతో దాడి చేసుకున్నారు. జుట్టు పట్టి పరస్పరం ఈడ్చుకున్నారు. కొందరు వ్యక్తులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆగితేగా.. తగ్గేదే లేదన్నట్లుగా తన్నుకున్నారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. ఇలా కొట్టుకోవడంతో.. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కర్నాటక రాజధాని బెంగళూరులో (Bengaluru School Girls Fight) ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం సెయింట్ మార్క్ రోడ్డులో కొందరు స్కూల్ గర్ల్స్ రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్నారు. బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్‌కు (Bengaluru School Girls Video) ఎదరుగానే ఈ ఘటన జరిగింది. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న అమ్మాయిలు బిషప్ కాటర్ స్కూల్‌కు చెందిన వారే. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఎవరో క్లారిటీ లేదు. అక్కడ కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇరు వర్గాల అమ్మాయిలు మాత్రం... రోడ్డుపైకి వెళ్లి నానా రచ్చ చేశారు. అపరకాళిలా అవతారమెత్తి.. పరస్పరం చితకబాదుకున్నారు. జట్టు పట్టుకొని లాక్కుంటూ... కర్రలతో కొట్టుకుంటూ... కిందపడేసుకొని ముష్టి ఘాతాలకు దిగుతూ.. కెమెరాకు చిక్కారు. ఇద్దరు అమ్మాయిలు మెట్లపై నుంచి తోసుకుంటూ కనిపించారు. వారిలో ఒకరు కిందపడిపోయారు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాలేదు. కానీ చూసేందుకు మాత్రం.. ఒక యుద్ధంలానే కనిపించింది. భయానక వాతావరణం ఏర్పడింది. అంత తీవ్రంగా కొట్టుకున్నారు ఆ అమ్మాయిలు. ఈ స్ట్రీట్ ఫైట్‌లో పలువురికి గాయాలయ్యాయి.
ఐతే ఓ అబ్బాయి విషయంలోనే వీరి మధ్య గొడవ తలెత్తిందని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా (Bengaluru Viral Video)లో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్‌ను బట్టి.. వారు బాయ్ ఫ్రెండ్ కోసమే కొట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఇటు పోలీసులు గానీ.. అటు స్కూల్ మేనేజ్మెంట్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ అమ్మాయిలు మాత్రం నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. వారిని చూసి.. అసలు వీరి స్కూల్ విద్యార్థినులేనా.. లేదంటే రౌడీ గ్యాంగ్‌లా అన్నంతగా.. తన్నుకున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. ఇప్పుడు బెంగళూరులో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకోవడం.. అందులోనూ వారు స్కూల్ గర్ల్స్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.