Viral: భరతనాట్యం.. హిప్ హాప్ కలిపి కొత్త డాన్స్.. యూట్యూబ్ లో నెటిజన్లు ఫిదా

భారతదేశం కళలకు పుట్టినిల్లు. అందులో భరతనాట్యానికి ఉన్న ఖ్యాతి గురించి వేరే చెప్పక్కర్లేదు. భారత్ లో మాదిరే విదేశాలలో హిప్ హాప్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం లా ఉండే ఈ రెండు కళారుపాలను కలిపి డాన్స్ చేస్తున్నారు ఇద్దరు యువతులు.

news18
Updated: October 23, 2020, 3:02 PM IST
Viral: భరతనాట్యం.. హిప్ హాప్ కలిపి కొత్త  డాన్స్.. యూట్యూబ్ లో నెటిజన్లు ఫిదా
image credits youtube
  • News18
  • Last Updated: October 23, 2020, 3:02 PM IST
  • Share this:
కళలకు పుట్టినిల్లైన భారత్ లో.. మనదేశ కళారంగానికే తలమానికంగా నిలిచే వాటిలో భరతనాట్యం ఒకటి. వేలాదిమంది కళాకారులు.. ఆ నాట్యాన్ని ఎల్లలు దాటించి.. ప్రపంచ వేదికల మీద ప్రదర్శించారు. మనకు భరతనాట్యం ఎలాగే అమెరికాలో హిప్ హాప్ అలాగే ఫేమస్. ఒక ఆంగ్లో ఇండియన్.. ఇవి రెండు కలిపి చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నది. సాంప్రదాయ భారతీయ చీరకట్టుతో పాటే.. అమెరికన్ వస్త్రధారణ మిక్స్ అయ్యేలా వేసుకుని.. పలు హిప్ హాప్ సాంగ్స్ కు డాన్స్ చేస్తున్నది. తన మిత్రురాలితో కలిసి ఈ వీడియోలు చేస్తున్న ఆమె పేరు ఉషా జే. భరతనాట్యం, హిప్ హాప్ సాంగ్స్ కలిసి డాన్స్ చేసిన ఉషా జే, ఆమె ఫ్రెండ్ ఓర్లేన్.. ఈ వీడియోలను యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలలో పోస్టు చేస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఇరువురు కలిసి చేస్తున్న డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగా హిప్ హాప్ డాన్స్, భరతనాట్యం రెండు వేరువేరు కళారూపాలు. అంతేగాక అవి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం మాదిరిగా ఉంటాయి. కానీ ఉషా జే మాత్రం అవి రెండింటినీ కలిపి డాన్స్ చేస్తుండటం.. అది కూడా అందరితోనూ వావ్ అనిపించుకోవడం గమనార్హం. స్వయంగా ఉషా జే నే ఈ డాన్స్ రూపకర్త కావడం గమనార్హం.



యూట్యూబ్ లో ఈ వీడియోలను పోస్టు చేస్తున్న ఉషా జే.. వీటికి ‘హైబ్రిడ్ భారతం’అని పేరు పెట్టింది. ఈ ఏడాది ఆగస్టులో ఆమె యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. అప్పట్నుంచి వరుసగా ఈ వీడియోలు పోస్టు చేస్తుంది.











View this post on Instagram





This week on crossovers nobody asked for but everybody deserves - Hip Hop X Bharatham


A post shared by YouTube India (@youtubeindia) on






దీనిపై ఉషా జే స్పందిస్తూ.. ఈ కళా రూపకాన్ని తాను హైబ్రిబ్ భారతం అని పేరు పెట్టానని చెప్పారు. రెండు విభిన్న శైలిగా ఉండే.. భరతనాట్యం, హిప్ హాప్ ను కలపడానికి తాన ఇష్టపడతానని తెలిపారు. భరతనాట్యం పట్ల తనకు ఎనలేని ప్రేమ ఉన్నదనీ, అయితే తానేమీ భరతనాట్యం నిపుణురాలిని కాదని ఆమె అన్నారు. ఏదెలా ఉన్నప్పటికీ రెండు డిఫరెంట్ జోనర్లను కలిపిన ఉషా కు ప్రశంసలు దక్కుతున్నాయి.
Published by: Srinivas Munigala
First published: October 23, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading