Dogs hug: క్యా సీన్​ హే.. రోడ్డుపైనే హగ్​ చేసుకున్న రెండు కుక్కలు.. కంటతడి పెట్టిన నెటిజన్లు

కౌగిలించుకుంటున్న శునకాలు

రెండు కుక్కల(dogs) ఈ ఫోటో లక్షలాది మంది నెటిజన్ల(netizen)ను ఏడిపించింది. ఇందులో రెండు బుజ్జి కుక్కలు కౌగిలించుకోవడం(hug) కనిపిస్తుంది. ఇద్దరూ ఒకదానికొకటి కౌగిలించుకున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ ఏడ్చేశారు.

  • Share this:
    సోషల్​ మీడియా ఎక్కడ ఏం జరిగినా ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తానికి తెలియజేయగలదు. సోషల్ మీడియాలో వందలాది ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీ వీడియోలు.. ఫోటోలు చాలా ఎమోషనల్​(Emotional)​తో కూడా ఉంటాయి. అవి మెల్లమెల్లగా ఫేమస్​ అవుతాయి. ఓ బచ్​పన్​ కా ప్యారా, బాబా కా దాబా, పెళ్లిలో ఫొటో గ్రాఫర్​ సందడి, నీళ్లలో పడిన ఫొటోగ్రాఫర్​ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో రెండు(two) కుక్కల (Cute-Emotional Photos) చిత్రాన్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. రెండు కుక్కల(dogs) ఈ ఫోటో లక్షలాది మంది నెటిజన్ల(netizen)ను ఏడిపించింది. ఇందులో రెండు బుజ్జి కుక్కలు కౌగిలించుకోవడం(hug) కనిపిస్తుంది. ఇద్దరూ ఒకదానికొకటి కౌగిలించుకున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ ఏడ్చేశారు. మనం కుక్కల అందమైన ఫొటోలను చూశాం. కానీ అలాంటి భావోద్వేగ చిత్రాన్ని చూడలేదు. ఈ ఫోటోను @woodwardSumer అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. చిత్రంలో కనిపించే రెండు కుక్కలలో ఒకటి ఆమె స్వంత కుక్క పేరు హెన్రీ. ఇంతకు ఆ కుక్కల సంగతేంటో ఓ లుక్కేద్దాం..



    హెన్రీ(henri) తో దాని యజమాని కలిసి రోజూ వాకింగ్‌కు వెళుతారు. అదే పనిగా ఓ రోజు కుక్క పిల్లతో వాకింగ్​కి వెళ్లారు. అదే సమయంలో అటుగా వచ్చిన మరోకరు కుక్కతో కలిసి వాకింగ్‌కు వచ్చారు. ఆ రెండు కుక్కలు పక్క పక్కనే రావడంతో రెండు గట్టిగా పట్టుకున్నాయి. మనుషులా రెండు కుక్కలు ఒకరినొకరు ఎలా కౌగిలించుకుంటున్నాయో నమ్మలేకపోయారు. యజమాని @woodwardSume వెంటనే దానిని ఫోటో తీసి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అప్పటివరకు కేవలం 17 వందల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్న ఆమె ఖాతాలో లక్షలాది లైకులు వచ్చాయి. ఇది కాకుండా వేలాది మంది సార్లు రీట్వీట్ చేశారు. ఈ చిత్రం ప్రజలను చాలా భావోద్వేగానికి గురి చేసింది. దీనిపై చాలా మంది వ్యాఖ్యానించారు. ఈ చిత్రం తనను ఏడిపించిందని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. అదే సమయంలో ఒక వ్యక్తి కుక్కల మధ్య ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని అభిప్రాయ పడ్డాడు. ఫోటో చూసిన తర్వాత అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రం ప్రజలను ఏడిపిస్తోంది. నెటిజన్లు అయితే ఏనాటి ఈ బంధమే అంటూ కామెంట్ పెట్టడంతో అవునంటున్నారు. చూశారుగా మనుషులే కాదు కుక్కలూ హగ్​(hug) చేసుకుంటాయి అన్నమాట.
    Published by:Prabhakar Vaddi
    First published: