Viral News: 2007లో భోజనానికి వెళ్లాడు.. పద్నాలుగేళ్లకు తిరిగొచ్చాడు.. అసలేమైందో తెలిస్తే షాకవుతారు

ప్రతీకాత్మక చిత్రం

ఓ ట్విట్టర్ యూజర్ 2007 మార్చి 15న లంచ్ కు వెళ్తున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు. మొదటి పోస్ట్‌లో లంచ్ కోసం వేచి చూస్తున్నా అని.. మరో పోస్ట్‌లో లంచ్ కోసం బయటకు వెళ్తున్నట్లు పోస్ట్ చేశాడు. అయితే..

  • Share this:
ట్విట్టర్ ఎన్నో రకాల ఫన్నీ జోక్స్, ఎమోషనల్ కథలకు కేంద్రంగా మారుతుంది. ఇప్పుడైతే ఏదో ఒక సమయంలో పోస్ట్ చేస్తున్నాం కానీ ట్విట్టర్ ఫేస్ బుక్ లాంటివి ప్రారంభమైన కొత్తల్లో రోజూ మన రెగ్యులర్ అప్ డేట్స్ కూడా అందులో పోస్ట్ చేసేవాళ్లు చాలామంది. ఇడ్లీ తింటున్నా.. కాలేజీకి వెళ్తున్నా.. అంటూ చాలామంది అప్ డేట్స్ పెట్టేవాళ్లు.. ఒకవేళ ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఫేస్ బుక్ లేదా ట్విట్టర్‌లో పెట్టిన అప్ డేట్ చూస్తే సరిపోయేది. అలాగే @deleted అనే ట్విట్టర్ యూజర్ 2007 మార్చి 15న తాను లంచ్‌కి వెళ్తున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు. మొదటి పోస్ట్‌లో లంచ్ కోసం వేచి చూస్తున్నా అని.. మరో పోస్ట్‌లో లంచ్ కోసం బయటకు వెళ్తున్నట్లు పోస్ట్ చేశాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత అసలు ఆ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేయడమే మానేశాడు.
రైలు పట్టాలపై పడుకొని చనిపోయినట్లుగా యాక్టింగ్.. సోషల్ మీడియాలో వీడియో.. రంగంలోకి పోలీసులు.. చివరకు ఏమైందంటే..

దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఆదివారం.. అంటే 2021 జులై 25న అతడు ట్విట్టర్‌లో మరో పోస్ట్ పెట్టాడు. లంచ్ నుంచి తిరిగి వచ్చేశాను అని అందులో పేర్కొన్నాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. పద్నాలుగు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి లంచ్ చేస్తూనే గడిపాడా? అన్ని రోజులు తిన్న ఆ పదార్థం ఏంటి? అంటూ ట్విట్టర్ యూజర్లు ఎన్నో ఫన్నీ కామెంట్లు చేస్తూ ఆ వ్యక్తిని ఆటపట్టిస్తున్నారు. మరికొందరేమో 14 సంవత్సరాల కింద ఆ అకౌంట్ పాస్ వర్డ్ పోగొట్టుకున్నాడేమో.. ఇప్పుడే అతడికి ఆ పాస్ వర్డ్ దొరికినట్లుంది. అందుకే తిరిగి లాగిన్ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

నువ్వు నా ప్రస్తుత జీవిత కాలం మొత్తం భోజనం చేస్తూనే ఉన్నావు అంటూ ఓ యూజర్ రాశాడు. అతడు లంచ్‌కి వెళ్లే సమయానికి తాను కేవలం రెండు సంవత్సరాల బాలుడిని అని, ప్రస్తుతం తన వయసు 16 సంవత్సరాలని చెప్పుకొచ్చాడు. ఇన్ని రోజులుగా నువ్వు ఏం తింటున్నావు.. మేం కూడా అదే తినడానికి ప్రయత్నిస్తాం.. అంటూ మరో యూజర్ చెప్పడం విశేషం.

మరో యూజర్ దీనికి ఓ లాజిక్ చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ రెండు ట్వీట్లు చేశాడేమో.. అప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన ట్వీట్లన్నీ డిలీట్ చేసి ఈ ట్వీట్ ని చేశాడేమో.. అని చెప్పుకొచ్చాడు. మీరు వెళ్లిన రెస్టారెంట్ ఎక్కడో చెప్పండి... అక్కడికి అస్సలు వెళ్లకుండా ప్రయత్నిస్తాం అని చాలామంది ట్వీట్ చేశారు.







ఆ తర్వాత ఈ @deleted అనే యూజర్ మరో రెండు ట్వీట్స్ కూడా చేశాడు. ఓ అమ్మాయిని లంచ్ కోసం పిలిచాను అని ఒక ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కొన్ని గంటలకు.. ‘తను వస్తుందని వేచి చూశాను. కానీ ఇప్పటివరకు రాలేదు’ అంటూ ట్వీట్ చేసి తన ఆలస్యానికి గల కారణం వెల్లడించాడు. ఈ పద్నాలుగు సంవత్సరాలు ట్వీట్ చేయకుండా ఆ యూజర్ ఇప్పుడు ట్వీట్ చేయడానికి గల కారణం మాత్రం ఇంత వరకు ఓ మిస్టరీగానే ఉంది అంటూ ఫీలవుతున్నారు ట్విట్టర్ యూజర్లు.
Published by:Nikhil Kumar S
First published: