ముంగిట్లో మూడో ప్రపంచ యుద్ధం..?

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. నేడో, రేపో యుద్ధం వచ్చి, అది.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? అన్నట్లుగా పరిస్థితి మారింది.

news18-telugu
Updated: January 6, 2020, 3:01 PM IST
ముంగిట్లో మూడో ప్రపంచ యుద్ధం..?
డోనాల్డ్ ట్రంప్
  • Share this:
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. నేడో, రేపో యుద్ధం వచ్చి, అది.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరాన్ సైన్యాధిపతి ఖాసీం సులేమానిని అమెరికా దళాలు హతమార్చడంతో, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అందుకు తగ్గట్లు.. తమ దేశంలోని జంకారా మసీదు గుమ్మటంపై ఎర్ర జెండాను ఎగురవేశారు. దీనర్థం.. యుద్ధం రాబోతోందని అనడానికి సంకేతంగా భావిస్తారు. ఒబామా హయాంలో 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ సర్కారు వైదొలిగినప్పటి నుంచి ఇరాన్ ఆ నిబంధనలను అతిక్రమిస్తూ వస్తోంది. తాజాగా.. యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకుంటున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని ఎత్తేసినట్లు పేర్కొన్నది.

కాగా, ఈ ఉద్రిక్త వాతావరణం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఇరాన్-అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఉదయం నుంచే దేశియ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓ దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 670 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోయి 12 వేల పాయింట్ల దిగువునకు పడిపోయింది.

First published: January 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు