తనకు తానుగా ఎద్దుల బండిని తీసుకెళ్లిన ఎద్దు... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు...

ఇది నిజంగానే అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. అసలు ఆ ఎద్దు... ఎలా అలా ఆలోచించగలిగిందని షాకవుతున్నారు. చిత్రంగా ఉంది అంటున్నారు.

news18-telugu
Updated: June 24, 2020, 10:13 AM IST
తనకు తానుగా ఎద్దుల బండిని తీసుకెళ్లిన ఎద్దు... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు...
తనకు తానుగా ఎద్దుల బండిని తీసుకెళ్లిన ఎద్దు... (credit - twitter)
  • Share this:
జనరల్‌గా రైతులు ఎద్దులకు ఎద్దుల బండిని... సెట్ చేసి... చల్ చల్ అంటే... అప్పుడు ఎద్దులు ముందుకు సాగుతాయి. ఇది మనం ఎక్కడైనా చూసేదే. అలాంటిది... ఆ ఎద్దు మాత్రం తనకు తానుగా వెళ్లి... ఎద్దుల బండిని తన తలకు తగిలించుకొని... తనే స్వయంగా దాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఎద్దు మనిషిలా ఎలా ఆలోచించిందన్నది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ బండిని లాక్కెళ్లడం తన పని అని ఆ ఎద్దు ఎందుకు భావించింది అన్నది అందర్నీ ఆలోచనలో పడేస్తోంది.


ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ఆత్మనిర్భర భారత్ అనే నినాదాన్ని అందించారు కదా. ఈ ఎద్దు ఆ నినాదాన్ని పాటిస్తోందనీ... నిర్భరంగా ఉంటూ... తనకు తానుగా బండిని ఎత్తుకొని తీసుకెళ్లిపోయిందని నెటిజన్లు అంటున్నారు. జంతువులు కూడా తమ విధులు, బాధ్యతల్ని గ్రహిస్తున్నాయి అని మరో నెటిజన్ అన్నారు. ఆ ఎద్దు మనుషుల కంటే బెటర్ అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.ఈ వీడియోకి ఇప్పటికే... 2లక్షల మందికి పైగా చూశారు. 28 వేల మంది లైక్ చేశారు. 4.8 వేల మంది రీట్వీట్ చేశారు. చాలా మంది ఈ వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఎందుకంటే... అసలు ఆ ఎద్దు మనిషిలా ఎలా ఆలోచించిందన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది.
First published: June 24, 2020, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading