Twitter: ట్విట్టర్ యూజర్లకు గుడ్​న్యూస్​.. ఉచితంగా ఎన్‌ఎఫ్‌టిలు.. ఎలా గెలుచుకోవాలంటే?

(Image Source-Twitter)

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్​ తన యూజర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. డిజిటల్ ఆర్ట్​వర్క్​తో కూడిన 140 నాన్- ఫంజిబుల్ టోకెన్ల (ఎన్‌ఎఫ్‌టి)ను ఎంపిక చేసిన యూజర్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • Share this:
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్​ తన యూజర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. డిజిటల్ ఆర్ట్​వర్క్​తో కూడిన 140 నాన్- ఫంజిబుల్ టోకెన్ల (ఎన్‌ఎఫ్‌టి)ను ఎంపిక చేసిన యూజర్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్‌ఎఫ్‌టిలను గెలుచుకునేందుకు మీరు చేయాల్సిందల్లా ట్విట్టర్‌లో ఈ ప్రాజెక్ట్​ గురించి ట్వీట్ చేయడమే. అలా ట్వీట్​ చేసిన వారిలో నుంచి 140 మందిని ఎంపిక చేసి ఎన్​ఎఫ్​టిలను అందజేస్తారు. గెలుచుకున్న వారు ఈ ఎన్‌ఎఫ్‌టిలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే విషయాన్ని వారికి పర్సనల్​గా తెలియజేస్తుంది. ట్విట్టర్ సంస్థ రారిబుల్ సహాయంతో ఫస్ట్ బోర్న్, ఫ్యూరీ ట్విట్టర్, విటమిన్ టి, రిప్లై గై వంటి ఏడు వేర్వేరు డిజిటల్ కళాకృతులతో 20 ఎన్ఎఫ్​టీ వెర్షన్లను సృష్టించింది. బ్రాండ్​ ప్రమోషన్​లో భాగంగా ఈ ఎన్‌ఎఫ్‌టిలను ఉచితంగా తన యూజర్లకు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, అసలు ఎన్​ఎఫ్​టీలు అంటే ఏంటి? వాటిని ఎలా కొనుగోలు చేయాలి? వాటి ప్రత్యేకత ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఎన్​ఎఫ్​టీ అంటే ఏంటి?
ఎన్ఎఫ్​టీ అంటే నాన్​ ఫంజిబుల్​ టోకెన్​. అంటే దీన్ని రీప్లేస్​ చేయలేమని అర్థం. ఇది ప్రపంచంలోనే యూనిక్​ డిజిటల్​ పెయింటింగ్​ లాంటిది. ప్రపంచంలో ఈ పెయింటింగ్​ ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటుంది. వారికే దానిపై పూర్తి పేటెంట్​ హక్కులు ఉంటాయి. తద్వారా దీన్ని డూప్లికేట్​ చేసి ఎవ్వరూ అమ్మలేరు. అయితే, పేటెంట్​ హక్కులు ఉన్న వ్యక్తి అరుదైన పెయింటింగ్స్​ను డిజిటల్​ రూపంలో అనగా క్లిప్స్​, జిప్​ ఫైల్స్​, వీడియోల రూపంలోకి మార్చి అమ్ముకోవచ్చు. దీనికి జత చేసిన టోకెన్​పై యజమాని పేరు రాసి ఉంటుంది. ఎన్​ఎఫ్​టీల రూపకల్పనలో ఇథీరియం బ్లాక్​ చెయిన్​ టెక్నాలజీని వాడతారు. అందుకే దీనికి కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంటారు.

ట్విట్లర్​ ప్రస్తుతం 140 ఎన్​ఎఫ్​టీలను కలిగి ఉంది. వీటిని తన యూజర్లకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. 2021 ప్రారంభం నుండి ఎన్‌ఎఫ్‌టిల గురించి 29 మిలియన్లకు పైగా ట్వీట్​ చేశారని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీన్ని బట్టి ఎన్​ఎఫ్​టీలకు పెరుగుతున్న ఆదరణను ఆయన గుర్తు చేశారు. కాగా, ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఈ ఏడాది ప్రారంభంలో ఎన్ఎఫ్​టీ ట్రాన్సాక్షన్​లో పాల్గొన్నాడు. ఆయన చేసిన మొట్టమొదటి ట్వీట్​ను డిజిటల్​ వేదికపై నాన్-ఫంజిబుల్ టోకెన్గా (ఎన్​ఎఫ్​టీ)గా విక్రయించాడు.
Published by:Sumanth Kanukula
First published: