• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • TWITTER INDIA REVEALS MOST RETWEETED AND MOST LIKED TWEETS IN 2020 BA GH

#ThisHappened2020: ఈ ఏడాది ట్విటర్‌లో దుమ్మురేపిన అంశాలివే.. కరోనా కంటే ఎక్కువ ఫేమస్ అయిన అంశాలు

#ThisHappened2020: ఈ ఏడాది ట్విటర్‌లో దుమ్మురేపిన అంశాలివే.. కరోనా కంటే ఎక్కువ ఫేమస్ అయిన అంశాలు

Twitter: (ప్రతీకాత్మక చిత్రం)

Twitter Recap 2020: రివైండ్ 2020లో భాగంగా ట్విట్టర్‌లో అత్యధికంగా లైకులు పొందిన ట్వీట్స్, సబ్జెక్ట్స్ , షేర్లు సంపాదించి, రీట్వీట్లు పొందిన ట్వీట్ల ను వెల్లడించింది. #ThisHappened2020 తో ప్రస్తుతం ఇవి ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి.

  • Last Updated:
  • Share this:
రివైండ్ 2020లో భాగంగా ట్విట్టర్‌లో అత్యధికంగా లైకులు పొందిన ట్వీట్స్, సబ్జెక్ట్స్ , షేర్లు సంపాదించి, రీట్వీట్లు పొందిన ట్వీట్ల ను వెల్లడించింది. #ThisHappened2020 తో ప్రస్తుతం ఇవి ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది అత్యధిక ట్విట్టరాటీలు ఇష్టపడ్డవి, షేర్ చేసినవి ఇవేనంటూ ట్విట్టర్ కొన్ని ఆసక్తికరమైన హైలైట్స్ ను అధికారికంగా ట్వీట్ చేసింది. తన ఫ్యాన్స్ తో తమిళ్ హీరో విజయ్ సెల్ఫీ తమిళ తంబీలు తెగ లైక్ చేశారంటూ టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. తమిళ ట్విట్టరాటీలు ఎక్కువగా ఈ పిక్ ను వైరల్ చేశారు. తన సతీమణి, నటి అనుష్క శర్మ త్వరలో తల్లి కాబోతోందంటూ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో దుమ్ము రేపింది. అఫ్ కోర్స్ 2020 లో టాప్ హ్యాష్ ట్యాగ్ గా మిగిలింది మాత్రం నిస్సందేహంగా #COVID19. ఆ తరువాతి 2 స్థానాల్లో నిలిచిన హ్యాష్ ట్యాగ్స్ #SushantSinghRajput, #Hathras. క్రీడా రంగానికి సంబంధించి #IPL2020 టాప్ ట్రెండ్ కాగా, హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ హఠాన్మరణం తరువాత రిలీజైన ఆయన సినిమా దిల్ బేచారాకు #DilBechara ఫిలిం ఇండస్ట్రీలో టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ దక్కింది. ఇక ఎక్కువ సార్లు ట్వీట్ అయిన మీమ్ మాత్రం #Binod వైరల్ అయింది.

కోవిడ్ మహమ్మారిపై సాహసోపేతమైన పోరాటం చేపట్టిన భారతీయులు, సాటివారి పట్ల ఎంతో సాదరాభిమానాలు చాటుకున్నారని ట్ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి వివరించారు. సెలబ్రిటీలు, సామాన్యులు అందరూ తమకు తోచినట్టు వితరణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినట్టు మనీష్ చెబుతున్నారు.

ఫ్యాన్స్ తో స్టార్ సెల్ఫీ
తమిళ స్టార్ హీరో విజయ్ (@actorvijay) తన ఫ్యాన్స్ తో కలిసి తీసుకున్న ఫొటో ఎక్కువ సార్లు రీట్వీట్ అయి సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 1,45,000 కంటే ఎక్కువసార్లు ఈ పిక్ రీట్వీట్ కావడం హైలైట్.

ట్విట్టర్లో విరాట పర్వమే
విరాట్ కోహ్లీ (@imVkohli) తన సతీమణి అనుష్క శర్మ త్వరలో తల్లి కాబోతున్న విషయాన్ని ట్వీట్ చేయగా ఈ ట్వీట్ కు 645,000 కంటే ఎక్కువ లైకులు రాబట్టి ట్విట్టర్లో మంచి ట్రెండ్ క్రియేట్ చేసింది.

మోదీ ట్వీట్ అంటే అంతే
ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్లో ఉన్న ఫాలోయింగ్ చాలాపెద్ద కరోనా COVID-19 పై పోరాటంలో దీపాలు వెలిగించాలంటూ ట్విట్టర్ ట్వీట్ ద్వారా జాతికి పిలుపునిచ్చిన మోదీ ట్వీట్ 100,000సార్లకు పైగా రీట్వీట్ అయిందంటే ఇదో సరికొత్త రికార్డు.

ధోనీ ట్విట్టర్ రికార్డ్
ఇక స్పోర్ట్స్ రీట్వీట్ విషయానికి వస్తే ఆ రికార్డును సొంతం చేసుకున్నది మన ఝార్ఖండ్ డైనమైట్ మహీంద్ర సింగ్ ధోనీయే. ప్రధాని తనను అభినందిస్తూ రాసిన ఉత్తరానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్లో ధోనీ చేసిన ట్వీట్ శరవేగంగా వైరల్ అయిపోయింది. క్రికెట్ లో రిటైర్ మెంట్ ప్రకటించిన ధోనీని అభినందిస్తూ మోదీ ధోనీని గొప్పగా ప్రశంసించారు.

ఇక బిజినెస్ వరల్డ్ లో రతన్ టాటా చేసిన ట్వీట్ అత్యధికంగా రీట్వీట్లు సొంతం చేసుకున్నట్టు ట్విట్టర్ అధికారిక ప్రకటన చేసింది. కోవిడ్-19 ప్రభావంతో కొన్ని సామాజిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, వారిని ఆదుకోవాలంటూ రూ.500 కోట్ల విరాళం ప్రకటించిన టాటా ట్వీట్ 50,000 పైగా రీట్వీట్ అయింది.

తనకు కరోనా సోకిందని, తనను కలిసినవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలంటూ నటుడు అమితాబ్ బచ్చన్ స్వయంగా చేసిన ట్వీట్ మోస్ట్ కోటెడ్ ట్వీట్ గా ఎంపికైంది.

2020 టాప్ Hashtags ఇవే
కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 2020లో అత్యధికంగా ట్రెండ్ అయిన టాప్ హ్యాష్ ట్యాగ్స్ గా #Covid19 నిలిచింది. భారత వైద్య ఆరోగ్య శాఖ, WHO చేసిన పలు ట్వీట్లు, హ్యాష్ ట్యాగ్ లు కూడా మైక్రోబ్లాగింగ్ సైట్లో ట్రెండింగా గా నిలువగా వాటిలో తొలి స్థానాలు #WearAMask, #StayHomeStaySafe, #maintainSocialDistance కు దక్కాయి. కరెంట్ అఫైర్స్ కాకుండా ఆతరువాత నెటిజన్లు అత్యధికంగా ఫోకస్ పెట్టి, చర్చించింది హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి. #SushantSinghRajput, #DilBechara హ్యాష్ ట్యాగ్ టాప్ లో నిలిచాయి. క్రీడారంగంలో #IPL2020, #WhistlePodu,#TeamIndia, ICC Women's T20 World Cup వంటివి టాప్ హ్యాష్ ట్యాగ్స్ గా వైరల్ అయ్యాయి. ఇక మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ హ్యాష్ ట్యాగ్ విషయానికి వస్తే #DilBechara, తమిళ సినిమా #SooraraiPottru, తెలుగు సినిమా #SarileruNeekevvaru మొదటి 3 స్థానాలు ఆక్రమించాయి.

దూరదర్శన్ లో రామాయణం
దూరదర్శన్ లో పునఃప్రసారమైన రామాయణం సీరియల్ పై #Ramayan గతాన్ని గుర్తుచేసేలా వైరల్ అయింది. DD Nationalలో ప్రసారమైన ఈ సీరియల్ మరోసారి భారతీయులందరి మదిని దోచుకుంది. తెలుగు బ్లాక్ బస్టర్ ఫిలిం పోకిరి రిలీజ్ అయి 14 ఏళ్లు కావటంతో #Pokiri పేరుతో మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్లో తెగ సందడి చేశారు. పాత రోజులను గుర్తు చేసే మరో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ గా #Mahabharat లాక్ డౌన్ టైంలో ట్విట్టర్లో బాగా వైరల్ అయింది.

2020లో భారతీయులు అత్యధిక ఆసక్తి చూపిన సబ్జెక్టులుగా #Photography, #Yoga, #Poetry ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు