ఈమధ్య కాలంలో వివాహ వేడుకల్లో వింత సంఘటనలు, విచిత్రమైన దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. కాని మహరాష్ట్ర(Maharashtra)షోలాపూర్(Sholapur)లోని అక్లూజ్ (Akluj)ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకే ఇప్పుడు వింత చర్చకు కారణమైంది. విచిత్రం ఏమిటంటే ఏ భార్య తన భర్తకు మరో అమ్మాయిని భార్యగా ఊహించుకోదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలన్నది హిందు ధర్మం. కాని అక్లూజ్‌లో మాత్రం స్వయంగా ఇద్దరు అక్కచెల్లెళ్లు(Twin girls)కలిసి ఒకే యువకుడ్ని పెళ్లి చేసుకొని అందర్ని ఆశ్చర్యపరిచారు. అయితే ఇద్దరూ అక్కచెల్లెళ్లు ఒకే వరుడ్ని మనువాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియాలంటే ఈస్టోరీ వినాల్సిందే.
వెరైటీ వెడ్డింగ్ ..
మహరాష్ట్రలో కల్యాణ వేదికపై పెళ్లి కొడకు ఇద్దరు అమ్మాయిలను ఒకే సమయంలో వివాహం చేసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన అక్లూజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వరుడి పేరు అతుల్. పెళ్లి కూతుళ్ల పేర్లు రింకీ, పింకీ. ఇద్దరూ కవల పిల్లలు ఒకే తల్లి కడుపున కలిసి పుట్టిన ఈ ఇద్దరూ అక్కచెల్లెళ్లు చిన్ననాటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ముంబైలోని కందివాలిత్లో నివసిస్తున్నారు.
महाराष्ट्र के पंढरपुर में दो सगी बहनों ने एक ही लड़के से शादी की..#Viral #viralvideo pic.twitter.com/eZQFjLlvO5
— Vivek Gupta (@imvivekgupta) December 3, 2022
ఇద్దర్ని పెళ్లాడిన వరుడు..
ఈ అక్కచెల్లెళ్లు ఇద్దరూ తండ్రి లేకపోవడంతో తల్లితో కలిసి ముంబైలోనే నివసిస్తున్నారు. కవల యువతులు రింకి, పింకీ సాఫ్ట్ ఇంజనీర్లుగా అంధేరిలోని ఓ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఒకరోజు ఇద్దరూ అస్వస్థతకు గురైన సమయంలో అతుల్ ఆసుపత్రిలో చేర్పించాడు. మగ దిక్కులోని ఆ కుటుంబానికి అతుల్ దగ్గరవడంతో కవల యువతుల్లో ఒకరు అతడ్ని ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇద్దరూ కవల పిల్లలు కావడం..ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోవడంతో ఇద్దరూ కలిసి అతుల్ యాకాషిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అదే విషయాన్ని వరుడు అతుల్‌కి చెప్పారు.
ఆ విధంగా ముగ్గురు ఒక్కటయ్యారు..
ట్విన్స్ తీసుకున్న నిర్ణయాన్ని అతుల్ కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒకే ముహుర్తానికి ఇద్దరు అక్కచెల్లెళ్లకు అతుల్ ఉమ్మడి మొగుడుగా మారాడు. ఈ ఇద్దరు సోదరిమణులు నచ్చిన వాడి మెడలో ఒకేసారి వరమాల వేసి తమ వాడ్ని చేసుకున్నారు. రింకీ, పింకీ ట్విన్స్ చేసుకున్న వెడ్డింగ్ ఇప్పుడు వైరల్ న్యూస్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, National News, VIRAL NEWS, Wedding