వాతావరణాన్ని వివరిస్తుంటే వరుసగా వాయించేశారు...

Viral news of Iraq : ఆ టీవీ రిపోర్టర్‌కి లైవ్‌లో షాక్ తగిలింది. అక్కడ దట్టమైన మంచుకురుస్తోందని చెబుతుంటే... స్థానికులు అతన్ని మంచు ముద్దలతో కొట్టారు.

news18-telugu
Updated: February 17, 2020, 11:59 AM IST
వాతావరణాన్ని వివరిస్తుంటే వరుసగా వాయించేశారు...
వాతావరణాన్ని వివరిస్తుంటే వరుసగా వాయించేశారు... (credit - twitter - Rudaw English)
  • Share this:
Viral news of Iraq : అది ఇరాక్‌లోని సులేమానియా ప్రాంతం. శీతాకాలం కావడంతో అక్కడ భారీగా మంచు కురిసింది. కురుస్తూ ఉంది. అందువల్ల స్థానిక ఓ టీవీ ఛానెల్... వాతావరణ వార్తలు ఇవ్వాలనుకుంది. అందులో భాగంగా... రిపోర్టర్ అక్కడకు వెళ్లాడు. మంచులో నిల్చొని... వాతావరణం ఎలా ఉందో, మంచు ఎలా కురుస్తుందో లైవ్‌లో చెప్పడం మొదలుపెట్టాడు. ఐతే... అక్కడి స్థానికులు చిన్న చిన్న మంచు ముద్దలు తయారుచేసి అతనిపై కొట్టడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆ రిపోర్టర్ డిస్టర్బ్ అవ్వకుండా లైవ్ ఇస్తూనే ఉన్నాడు. అది చూసిన ఆ ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. ఇంకా పెద్ద సైజు మంచు ముద్దలు తయారుచేసి కొట్టారు. దాంతో అతను ఇబ్బంది పడినట్లైంది. దీనిపై ఆ టీవీ ఛానెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ రిపోర్టర్‌పై మంచు బాంబులు వేశారని ఫైర్ అయ్యింది.


ఓ ట్విట్టర్ యూజర్... ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీనిపై ప్రజలు రకరకాలుగా స్పందించారు. కొంత మంది ఆ రిపోర్టర్‌పై జాలి పడ్డారు. కొంత మంది... ఇరాకీలను ఇంత సంతోషంగా ఈ మధ్యకాలంలో చూడలేదు... పోనీలెండి అంటూ కామెంట్లు పెట్టారు. ఇంకో యూజర్... ఇలా స్నో బాల్స్ విసరడం అన్నది ఇరాక్‌లో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్ అంటూ సెటైర్ వేశారు. జనరల్‌గా ఇరాకీయులు బాంబుల్నే విసురుతారన్నది అతని అసలు ఉద్దేశం.
మరో యూజర్ వీడియోలో ఘటనతో సంబంధం లేకుండా స్పందించారు. ఇరాక్‌లో మంచుకురుస్తున్న వాతావరణంలో ఎంజాయ్ చెయ్యాల్సిందే అన్నారు. మరో యూజర్ చిత్రంగా స్పందించారు. ఇరాక్‌లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణాన్ని తాను చూడలేదనీ... ఇలా అతన్ని మంచుతో కొట్టడం వల్ల ఆ రిపోర్టర్ నిజమే చెబుతున్నట్లు నిర్ధారణ అయ్యిందని అన్నారు. ఇలా భిన్నమైన కామెంట్లతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు