లాటరీ గెలవడమే ఓ కిక్కు. ఇక టీవీలో లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు లాటరీ గెలిచినట్లు తెలిస్తే... ఆనందానికి అవధులుంటాయా? స్పెయిన్‌లో జరిగిందిలా. ది ట్రీటర్ రియల్ డి మాడ్రిడ్‌లో డిసెంంబర్ 22న లాటరీ తీశారు. విన్నర్స్‌ని ప్రకటించారు. ఆ టైంలో రిపోర్టర్ నటాలియా.. న్యూస్ కవరేజ్‌లో భాగంగా లాటరీ డ్రాను లైవ్ ఇస్తోంది. విదేశాల్లో ఆమె లాంటి చాలా మంది లాటరీలు కొంటారు. గెలిస్తే... జీవితమే మారిపోతుందనే నమ్మకం. నటాలియా తాను లాటరీ గెలుస్తానని అస్సలు అనుకోలేదట. కానీ అదృష్టం ఆమె తలుపు తట్టింది. ఆమె రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు చుట్టూ అపరిచితులే ఉన్నారు. నటాలియా లాటరీ గెలిచిందని తెలియగానే ఆమెతోపాటూ వాళ్లంతా కేరింతలు కొట్టారు. రేపు ఆఫీస్‌కి రావట్లేదని లైవ్‌లో చెప్పేసిందామె.
Aquí la tienes: "la reportera de La 1" de la que habla todo el mundo a estas horas. ¡Se llama Natalia Escudero! #LoteríaRTVE
🔴 Directo ➡ https://t.co/pfgTOQpaaN pic.twitter.com/58j3ACuNte
— TVE (@tve_tve) December 22, 2019
ఈ లాటరీలో నటాలియా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోలేదు. అయినప్పటికీ ఆమెకు 5000 యూరోలు వచ్చాయి. మన రూపాయిల్లో దాదాపు రూ.4లక్షలు. ఏదైనా విదేశానికి వేకేషన్కి వెళ్లేందుకు ఆ డబ్బు చాలు. అందుకే ఆమె అంతలా ఆనందపడిపోయింది. ఆటోమేటిక్‌గా ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే... 15వేల మంది లైక్ చేశారు. 5వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. అందరూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, Daily news, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu