నగ్నంగా కనిపించిన టీవీ యాంకర్... ఇన్‌స్టాగ్రామ్ వీడియో కలకలం...

కరోనా లాక్‌డౌన్ సమయంలో... అనూహ్య సంఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. మరి ఈ సంఘటన ఎలాంటిది? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారు?

news18-telugu
Updated: June 9, 2020, 1:52 PM IST
నగ్నంగా కనిపించిన టీవీ యాంకర్... ఇన్‌స్టాగ్రామ్ వీడియో కలకలం...
నగ్నంగా కనిపించిన టీవీ యాంకర్... ఇన్‌స్టాగ్రామ్ వీడియో కలకలం... (File)
  • Share this:
ఓ ప్రముఖ ఛానెల్‌కి చెందిన యాంకర్... క్రిస్ క్యూమో (Chris Cuomo)... తన భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో... బ్యాక్‌గ్రౌండ్‌లో నగ్నంగా కనిపించారు. పేజ్ సిక్స్ ప్రకారం... ఆ యాంకర్... తన ఇంట్లోని గార్డెన్‌లో నగ్నంగా నిలబడ్డారు. ఆ సమయంలో ఆయన భార్య తన యోగా సెషల్ వీడియో షూట్ చేసుకుంటుంటే... అందులో అనుకోకుండా ఆయన కూడా రికార్డ్ అయ్యారు. తన యోగా వీడియోని ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన ఓ నెటిజన్... ఆ వెనక నగ్నంగా ఉన్నది టీవీ జర్నలిస్ట్ కావచ్చు అని కామెంట్ పెట్టారు. అలా ఆ వీడియో దుమారం రేపింది.

క్రిస్... న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకి చిన్న తమ్ముడు. కరోనా వైరస్ కారణంగా... ఇంటి దగ్గరే ఉంటూ... లైవ్ న్యూస్ ఇస్తున్నారు. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం ఫ్యామిలీ అంతా... లాంగ్ ఐస్‌లాండ్ మాన్షన్‌లో ఉంటున్నారు.

దుమారం రేపిన తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశారు. అయితే... అప్పటికే... ఈగిల్ ఐ సోషల్ మీడియా యూజర్లు... ఆ వీడియోను స్క్రీన్ షాట్లు తీశారు. అవి ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. అలా 49 ఏళ్ల క్రిస్... ఇప్పుడు బుక్కైనట్లైంది. దీనిపై యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.క్రిస్‌కి మార్చి 31న కరోనా సోకింది. ఏప్రిల్‌లో ఆయన... మాస్క్ లేకుండా ఇంట్లోంచీ బయటకు రావడంతో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఇప్పటికీ తన ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోందని చెబుతున్నారు. తాను ఇదివరకట్లా ఆరోగ్యంగా లేనని ఆయన అనడం కలకలం రేపింది.
Published by: Krishna Kumar N
First published: June 9, 2020, 1:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading