Dog statue: చౌరస్తాలో బంగారు కుక్క విగ్రహం.. ఆవిష్కరించిన దేశాధ్యక్షుడు

అలబాయ్ (Alabai) అనే కుక్క జాతికి (dog breed) తుర్క్ మెనిస్తాన్ దేశం పెట్టింది పేరు. ఈ కుక్క జాతిని ఇక్కడ జాతీయ సంపదగా భావిస్తారు.

news18-telugu
Updated: November 16, 2020, 5:10 PM IST
Dog statue: చౌరస్తాలో బంగారు కుక్క విగ్రహం.. ఆవిష్కరించిన దేశాధ్యక్షుడు
బంగారు కుక్క విగ్రహం
  • Share this:
మన దేశంలో దివంగత రాజకీయ నాయులు, స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాలను చౌరస్తాల్లో చూస్తుంటా. ఇతర దేశాల్లో కూడా అలాంటి విగ్రహాలే కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా బంగారు కుక్క విగ్రహం (golden dog statue) చూశారా? అది కూడా బిజీ నాలుగు రోడ్ల కూడళ్లలో మీరు ఎప్పుడైనా చూశారా? తుర్క్ మెనిస్తాన్ (Turkmenistan) దేశ రాజధాని అష్కాభట్‌లో అత్యంత బిజీగా ఉన్న రోడ్ల కూడలిలో 10 అడుగుల ఎత్తున్న బంగారు కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. స్వయంగా దేశాధ్యక్షుడు గుర్బంగూలీ బెర్డిముఖమదోవ్ ఆ కుక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కుక్కలపై ఆయనది పిచ్చి ప్రేమ

అలబాయ్ (Alabai) అనే కుక్క జాతికి (dog breed) తుర్క్ మెనిస్తాన్ దేశం పెట్టింది పేరు. ఈ కుక్క జాతిని ఇక్కడ జాతీయ సంపదగా భావిస్తారు. అలబాయ్ కుక్కలంటే దేశాధ్యక్షుడు (president) గుర్బంగూలీ బెర్డిముఖమదోవ్ కి వల్లమాలిన ప్రేమ. ఎంత ప్రేమంటే గతేడాది ఏకంగా ఈ కుక్కల జాతిపై ఓ పుస్తకాన్ని స్వయంగా రాసి, దాన్ని జాతికి అంకితం సైతం చేశారు. ఈ కుక్క జాతిపై కవిత్వాన్ని (poetry on dog) కూడా రంగరించి రాసి, కుక్కలపై కవిత్వం రాసిన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.

సంప్రదాయ కుక్కల పోటీలు

తుర్క్ మెనిస్తాన్ లో కుక్కల పోటీలు చాలా ప్రసిద్ధిగాంచాయి. అతిపెద్ద వినోద క్రీడగా సంప్రదాయ కుక్కల పోటీలు దశాబ్దాలుగా స్థానికులను అలరిస్తున్నాయి. నిజానికి ఈ కుక్కజాతి ఎంతో భయంకరమైన ది, గొర్రెలు, మేకల కాపరులకు ఇవి కుడి భుజంలా పనిచేస్తాయి. అంతేకాదు కాపలా కుక్కలుగా ఇవి అత్యంత విశ్వాసాన్ని చూపుతాయి. అందుకే ఇక్కడి ప్రజల జీవితాల్లో ఇవి భాగమయ్యాయి.

ఎల్ఈడీ స్క్రీన్

ఈ కుక్క విగ్రహం కింద ఓ భారీ ఎల్ఈడీ స్క్రీన్ ను కూడా ఏర్పాటు చేశారు. స్క్రీన్ పైన అలబాయ్ జాతికి చెందిన కుక్కల వీడియోలు ప్లే చేశారు. అయితే ఈ బంగారు విగ్రహం రూపొందించేందుకు అయిన మొత్తం ఖర్చును మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. రేసు గుర్రాలు (race horse), హస్తకళలకు కేరాఫ్ గా ప్రపంచ దేశాల మధ్య స్థానం పదిలం చేసుకున్న తుర్క్ మెనిస్తాన్ కుక్కలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. దేశ అధ్యక్షుడు గుర్రాన్నిస్వారీ చేస్తున్నట్టు బంగారు విగ్రహాన్ని 2015లో ప్రారంభించారు. అంతేకాదు తుర్క్ మెనిస్తాన్ మిత్రదేశాలకు అలబాయ్ కుక్కలను బహుమతిగా ఇవ్వటం సంప్రదాయంగా పెట్టుకున్న ఈ అధ్యక్షుడు ఇప్పటికే ఇలా కుక్కలను గిఫ్టుగా ఇచ్చారు. ఈ గిఫ్టు అందుకున్న వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్, ఉజ్బెక్ దేశాధ్యక్షుడు, ఖతార్ దేశాధినేతలకు గుర్బంగూలి వీటిని బహూకరించారు కూడా.

చమురే జీవనాధారం

60 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో పెంపుడు కుక్కలు, గుర్రాలను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వీరి ప్రధాన ఆదాయ వనరుగా చమురు నిక్షేపాలుండగా, ఎడారి దేశమైన తుర్క్ మెనిస్తాన్ ఓ సోవియట్ దేశం.

హచికో తరువాత ఇదే

జపాన్ లోని హచికో (Hachiko) కుక్క విగ్రహం తరువాత ఆ స్థాయిలో వార్తల్లో నిలిచినది తుర్క్ మెనిస్తాన్ కుక్క విగ్రహం కావడం విశేషం. జంతువుల పట్ల మనుషులకున్న ప్రేమ, ఆదరణకు ప్రతిరూపం ఇలాంటి విగ్రహాలు. గతేడాది ఫ్రాన్స్ లో పిల్లులంటే ఇష్టపడేవారంతా కలిసి భారీ నిధులు సేకరించి పిల్లికి కాంస్య విగ్రహం (bronze cat statue) రూపొందించి, దాన్ని ఓ చౌరస్తాలో ఆవిష్కరించారు. మనదేశం విషయానికి వస్తే రాజకీయ నాయకులకు ఇలాంటి గౌరవం ఎక్కువగా లభిస్తుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 16, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading