Home /News /trending /

Woman Sarpanch: ప్రతీ సర్పంచ్ ఈమెలా ఉంటే కరోనా అమ్మమ్మ అయినా ఊళ్లో అడుగుపెట్టాలంటే వణుకే..

Woman Sarpanch: ప్రతీ సర్పంచ్ ఈమెలా ఉంటే కరోనా అమ్మమ్మ అయినా ఊళ్లో అడుగుపెట్టాలంటే వణుకే..

సర్పంచ్ క్రిష్ణ గుప్తా

సర్పంచ్ క్రిష్ణ గుప్తా

తుంగ తెహ్‌సిల్ గ్రామ సర్పంచ్ క్రిష్ణ గుప్త. ఎంఏ, బీఈడీ చదివి దాదాపు ఇరవై ఏళ్లకు పైగా టీచర్‌గా పనిచేసిన ఆమె ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందారు. చూడటానికి ఎంతో సింపుల్‌గా, నిండైన చీరకట్టుతో లక్షణంగా కనిపించే క్రిష్ణ గుప్త ఎంతో ముందుచూపు కలిగిన వ్యక్తి. ఆమె సర్పంచ్ కాక ముందు కూడా గ్రామానికి సంబంధించిన ఏ కీలక నిర్ణయమైన ఆమెను సంప్రదించాకే తీసుకునేవారు.

ఇంకా చదవండి ...
  సెకండ్ వేవ్ కారణంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. రాష్ట్రాలకు రాష్ట్రాలు కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫస్ట్ వేవ్‌లో నగరాలు, పట్టణాలపైనే ఎక్కువ ప్రభావం చూపిన ఈ వైరస్ సెకండ్ వేవ్‌లో మాత్రం పల్లె, పట్నం అనే తేడా లేకుండా విరుచుకుపడుతోంది. ఫలితంగా.. ఊళ్లకు ఊళ్లు కరోనా బాధిత గ్రామాలుగా మారుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు సర్పంచ్‌ల చొరవతో కరోనాను కట్టడి చేస్తూ ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాంటి గ్రామాల్లో రాజస్తాన్‌లోని తుంగ తెహ్‌సిల్ ఒకటి. ఈ గ్రామ జనాభా 9,000. ఊళ్లో మెజార్టీ జనం వర్తక వృత్తిలో కొనసాగుతున్నారు. గ్రామంలో కొందరికి కిరాణా షాపులు, ఫర్టిలైజర్ దుకాణాలు ఉండగా.. ఇంకొందరు సమీప పట్నంలో స్వీట్ షాపులు, ఇతర వ్యాపారాలను సాగిస్తున్నారు. బాలీవుడ్ హిస్టారికల్ హిట్ మూవీ ‘జోధా అక్బర్’ సినిమాలో కొన్ని సీన్లు ఈ గ్రామంలోనే చిత్రీకరించారు. అప్పటి నుంచి ఈ గ్రామం పేరు జనం నోళ్లలో నానింది. తుంగ తెహ్‌సిల్ గ్రామ సర్పంచ్ క్రిష్ణ గుప్త. ఎంఏ, బీఈడీ చదివి దాదాపు ఇరవై ఏళ్లకు పైగా టీచర్‌గా పనిచేసిన ఆమె ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందారు. చూడటానికి ఎంతో సింపుల్‌గా, నిండైన చీరకట్టుతో లక్షణంగా కనిపించే క్రిష్ణ గుప్త ఎంతో ముందుచూపు కలిగిన వ్యక్తి. ఆమె సర్పంచ్ కాక ముందు కూడా గ్రామానికి సంబంధించిన ఏ కీలక నిర్ణయమైన ఆమెను సంప్రదించాకే తీసుకునేవారు. ఆమె అభిప్రాయానికి గ్రామస్తులు అంతటి విలువనిచ్చేవారు.

  2020 సెప్టెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఎన్నికల్లో గెలిచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో గ్రామస్తుల్లో అవగాహన కల్పించేందుకు ఆమె ఎంతగానో కృషి చేస్తున్నారు. లౌడ్‌స్పీకర్లతో గ్రామంలో ప్రతిరోజు వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన ప్రొటోకాల్‌ను పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి మరీ ఆమె గ్రామస్తులకు ప్రతిరోజూ సూచిస్తున్నారు. పోలీసు, వైద్య శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు ఆమె సమావేశమవుతూ ప్రజారోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.

  ఇది కూడా చదవండి: Lockdown: లాక్‌డౌన్ టైంలో యాక్సిడెంట్ అయితే ఇదా పరిస్థితి.. సమయానికి ఈయన అటుగా వెళ్లడంతో..

  అంతేకాదు.. సర్పంచ్ చొరవతో గ్రామంలోని వేరువేరు ప్రాంతాల్లో పోలీసులు నిత్యం పహారా కాస్తూ గ్రామస్తులు గుమికూడకుండా.. భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, వార్డు మెంబర్ల సాయంతో గ్రామంలో కరోనా కట్టడికి సర్పంచ్ క్రిష్ణ గుప్త కృషి చేస్తున్నారు. ‘స్వయం సహాయత సమూహ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి గ్రామంలో ఉన్న మహిళలందరినీ ఆ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆమె ఈ గ్రూప్‌లో ఎప్పటికప్పడు అందుబాటులో ఉంటూ మహిళలనే వారి కుటుంబాలను కాపాడుకునే వ్యక్తులుగా సర్పంచ్ మార్చారు.

  ఇంత కట్టుదిట్టంగా కృషి చేస్తే.. ఏప్రిల్ 30, 2021 వరకూ గ్రామంలో కేవలం 32 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతీ మంగళవారం, కొన్ని సందర్భాల్లో శుక్రవారం కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న కుటుంబాలకు ఫ్రీ మాస్క్‌లు, సబ్బులు, శానిటైజర్స్ కూడా పంపిణీ చేస్తున్నట్లు సర్పంచ్ క్రిష్ణ గుప్తా ప్రకటించారు. మానసికంగా కూడా గ్రామస్తుల్లో ధైర్యం నింపాలన్నదే తన లక్ష్యమని క్రిష్ణ గుప్తా చెప్పారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Coron free village, Corona second wave, Rajastan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు