Home /News /trending /

dollar seshadri : డాలర్ శేషాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? -ttdలో ఆయనకంత ప్రాధాన్యమేంటి?

dollar seshadri : డాలర్ శేషాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? -ttdలో ఆయనకంత ప్రాధాన్యమేంటి?

డాలర్ శేషాద్రి ఇక లేరు

డాలర్ శేషాద్రి ఇక లేరు

50 ఏళ్ళ పాటు శ్రీవారి సేవలో తరించిన వ్యక్తిగా డాలర్ చరిత్రలోకి ఎక్కారు. ఆలయ మాడ విధుల్లో డాలర్ కనిపిస్తే ఆయనతో ఫోటోలు దిగేందుకు.... అయన వద్ద ఆశీర్వాదం పొందేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. టీటీడీలో శేషాద్రికి అంత ప్రాధాన్యం ఎందుకుండేది? ఆయనకా పేరు ఎలా వచ్చిందంటే..

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupathi, News18
  Dollor Seshadri డాలర్ శేషాద్రి.... శ్రీవారి భక్తులకు ఈ పేరు తెలియకుండా ఉండదు. కానీ పాల శేషాద్రి (పీ శేషాద్రి) అంటే మాత్రం అసలు ఎవరికీ తెలియదు. దేశ విదేశాల్లో హిందువులకు సుపరిచితుడు డాలర్ శేషాద్రి. 50 ఏళ్ళ పాటు శ్రీవారి సేవలో తరించిన వ్యక్తిగా డాలర్ చరిత్రలోకి ఎక్కారు. ఆలయ మాడ విధుల్లో డాలర్ కనిపిస్తే ఆయనతో ఫోటోలు దిగేందుకు.... అయన వద్ద ఆశీర్వాదం పొందేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. నిత్యం స్వామి వారి సేవలో తరిస్తూ.... శ్రీవారి ఉత్సవాలలో ముఖ్యపాత్ర పోషించే డాలర్ శేషాద్రిని అందరూ అర్చకులుగా భావిస్తారు. అలాంటి వ్యక్తి  ఇప్పుడు శ్రీవారి చెంతకు వెళ్లిపోయారు. కార్తీకమాసం పూజల కోసం విశాఖ వెళ్లిన ఆయన సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. టీటీడీలో శేషాద్రికి అంత ప్రాధాన్యం ఎందుకుండేది? ఆయనకా పేరు ఎలా వచ్చిందంటే..

  ప్రభుత్వాలు మారినా ఆయన మాత్రం..
  కానీ ఆయన టీటీడీ ఉద్యోగి అని కొంత మందికి మాత్రమే తెలుసు. పదవి విరమణ పొందిన... ప్రభుత్వాలతో సంబంధం లేకుండా స్వామి వారి సేవలో తరించిన వ్యక్తిగా డాలర్ కు గుర్తింపు ఉంది. కోర్టులో పిటిషన్ దాఖలైన., ప్రభుత్వాల పెత్తనాలు మారిన., ఎన్ని పాలకమండళ్లు వచ్చిన., అధికారులు వస్తూపోతున్న డాలర్ మాత్రం శ్రీవారి సేవలో తరించే వరం దొరికిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వ చట్టాలు.... నియమనిబంధనలు ఆయనకు అసలు అడ్డు రానేరావు.

  dollar seshadri : టీటీడీలో విషాదం -డాలర్ శేషాద్రి హఠాన్మరణం  ఆయన లేని ఉత్సవాలా?
  టీటీడీలో ఆయన మాటలకూ., ఆయన పనులకు అడ్డు చెప్పే వారే ఉండరు. ఎందుకంటే శ్రీవారి కైంకర్యాలపై ఉన్న పట్టు., శ్రీవారికి అలంకరించాల్సిన ఆభరణాలు., కైంకర్యాలు నిర్వహించాల్సిన పద్ధతులు ఆయనకున్న ఇంకెవరికి తెలియదనే చెప్పాలి. ఉదయం సుప్రభాత సేవ మెదలుకొని పవళింపు సేవ వరకు డాలర్ హడావిడి మాత్రమే కనిపిస్తుంది. నిత్యోత్సవాల నుంచి ఏడాదికి ఒకమారు నిర్వహించే బ్రహ్మోత్సవాల వారికు ఆయన లేనిదే పరిపూర్ణం కాదంటారు. వాహనం ముందుకు కదలాలన్న శేషాద్రి పలుకు తప్పనిసరి.

  డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చింది?
  తిరుమలకు ఎంతో మంది విఐపిలు వివిఐపిలు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. తిరుమలకు వచ్చిన విఐపిలు ప్రత్యేకించి డాలర్ శేషాద్రి ఆశీస్సులు పొందేందుకు ఆసక్తి చూపుతారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన విఐపిలకు రాచమర్యాదలు శేషాద్రి చేతుల మీదుగానే సాగుతుంది. అసలు పీ శేషాద్రిగా ఉన్న ఆయనకు డాలర్ శేషాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనేది చాల మందికి తెలియదు.

  డాలర్ల కుంభకోణం
  పీ శేషాద్రి అంటే అసలు ఎవరికి గుర్తురారు. డారల్ శేషాద్రిగానే గుర్తింపు ఉంది. ఆయనకా పేరు రావడానికి రెండు కారణాలున్నాయి. నుదుట నామాలు ధరించి మేడలో పెద్ద డాలర్ ను ధరించడం వల్లే ఆయనకు డాలర్ అనే బిరుదు వచ్చింది. ఆత్మీయులు సన్నిహితులు ఆయనను డాలర్ మామ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇక శ్రీవారి ఆలయంలో స్వామి వారి ప్రతిమతో కూడిన డాలర్ ను తాయారు చేసి విక్రయించే వారు. అది కూడా డాలర్ చేతులమీదుగానే సాగేది. అప్పటి నుంచి పి శేషాద్రికి బదులుగా డాలర్ శేషాద్రిగానే ప్రాచుర్యం పొందారు. 2006లో వెలుగు చూసిన డాలర్ల కుంభకోణం టీటీడీపై మాయని మచ్చగా మిగిలిపోయింది. దాదాపు 305 డాలర్లు మాయమవగా.. తీవ్ర కలకలం రేగింది. దీనిపై వెంటనే స్పందించిన టీటీడీ బోర్డు.. శేషాద్రితో పాటు మరో నలుగురు ఉద్యోగులనూ సస్పెండ్ చేసింది. విచారణకూ ఆదేశించింది. అయితే, కిందిస్థాయి ఉద్యోగులపాత్రే ఇందులో ఉందంటూ.. పై స్థాయిలో ఉన్న శేషాద్రికి క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్లీ విధుల్లో చేరిపోయారు శేషాద్రి.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Madhu Kota
  First published:

  Tags: Tirumala Temple, Ttd, Ttd news

  తదుపరి వార్తలు