విషాదం.. ఆర్టీసీ జాబ్ పోయిందన్న బెంగతో డ్రైవర్‌కు గుండెపోటు.. మృతి..

TSRTC Strike: ఆర్టీసీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ ఉద్యోగం పోయిందని బెంగతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో అతడికి గుండె పోటు వచ్చి, మృతి చెందాడు.

news18-telugu
Updated: October 10, 2019, 10:58 AM IST
విషాదం.. ఆర్టీసీ జాబ్ పోయిందన్న బెంగతో డ్రైవర్‌కు గుండెపోటు.. మృతి..
గుండె పోటుతో ఆర్టీసీ డ్రైవర్ ఖలీల్ మృతి
  • Share this:
ఆర్టీసీ సమ్మెలో విషాదం చోటుచేసుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో 48వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాదాపు లక్షా 50 వేల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. దసరా సందర్భంగా పండుగ చేసుకుందామనుకున్న కార్మిక కుటుంబాలకు నిరాశే మిగిలింది. పైగా సెప్టెంబరు నెల జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెల జీతం మీదనే బతికే ఎన్నో కుటుంబాలు దసరాకు కొత్త బట్టలు కూడా కొనుక్కోలేని స్థితికి చేరుకున్నారు. అయితే.. ఆర్టీసీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ ఉద్యోగం పోయిందని బెంగతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో అతడికి గుండె పోటు వచ్చి, మృతి చెందాడు. హైదరాబాద్‌లోని రామచంద్రాపురం ఈఎస్‌ఐ వద్ద నివాసం ఉంటున్న షేక్ ఖలీల్ మియా(48) హెచ్‌సీయూ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే, సమ్మెలో పాల్గొని విధులకు దూరంగా ఉన్నాడు. ఇంతలో సమ్మెలో పాల్గొన్న 48వేల మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారని సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేయడంతో ఖలీల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. దాని వల్ల గుండె పోటు వచ్చి మృతిచెందాడు. కాగా, ఖలీల్ మృతికి కారణం ప్రభుత్వమేనని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>