Video: ‘డొనాల్డ్ ట్రంప్ మా నాన్న..’ యువతి సంచలన ఆరోపణలు

బురఖా వేసుకున్న ఓ పాకిస్తానీ యువతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ను తన నిజమైన తండ్రిగా పేర్కొంది. అతడిని కలవాలని చెప్పింది.

news18-telugu
Updated: December 1, 2020, 4:49 PM IST
Video: ‘డొనాల్డ్ ట్రంప్ మా నాన్న..’ యువతి సంచలన ఆరోపణలు
డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ యువతి అమ్మారా (File)
  • Share this:
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సంగతి తెలిసిందే. ఆయన చిత్ర విచిత్రమైన చేష్టలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి. ఎప్పుడూ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, ఈసారి ఓ పాకిస్తాన్‌కు చెందిన అమ్మారా అనే యువతి ట్రంప్ పేరుతో దుమారం రేపింది. డొనాల్డ్ ట్రంప్ తన నిజమైన తండ్రి అని, ఆయన్ను కలవాలని చెప్పింది. బురఖా వేసుకున్న ఓ యువతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ను తన నిజమైన తండ్రిగా పేర్కొంది. సుమారు 10 మందికి పైగా రిపోర్టర్లు ముందు మీడియా సమావేశంలో ఆమె ఈ కామెంట్లు చేసింది. ‘డొనాల్డ్ ట్రంప్ మా అసలైన తండ్రి. నేను మా నాన్నను కలవాలి.’ అని చెప్పింది. తన తల్లి ఎప్పుడూ కేర్‌లెస్‌గా ఉంటుందంటూ ట్రంప్ తిడుతూ ఉండేవారని, ఈ విషయంలో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగేవని తెలిపింది.

వాస్తవానికి ఈ వీడియో మొదట 2018, డిసెంబర్‌లో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్‌లో పోస్ట్ అయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సెప్టెంబర్‌లో మరోసారి ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో వైరల్‌గా మారింది. గతంలో బయటకు వచ్చినప్పుడే ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. మళ్లీ మరోసారి ఈ వీడియో వచ్చినా కూడా నెటిజన్ల నుంచి రెస్పాన్స్ అలాగే ఉంది. నెటిజన్లు విపరీతంగా వీడియోను లైక్ చేస్తున్నారు.




ఐదుగురు పిల్లల (ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, బారోన్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, టిఫానీ ట్రంప్) తండ్రి అయిన డొనాల్డ్ ట్రంప్ నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం చెందారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి అయిన జో బిడెన్ చేతిలో ఓటమి చెందారు. అయితే, తాను ఓడిపోలేదని, పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ట్రంప్ చేసిన ట్వీట్లను ట్విటర్ బ్లాక్ కూడా చేసింది. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 1, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading