నా మాటకు తిరుగులేదు.. మీడియా కథనాలు పుకార్లేనన్న ట్రంప్

‘మీ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదంటగా’ అని విలేకరులు ప్రశ్నించగా ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.

news18-telugu
Updated: April 23, 2019, 8:03 PM IST
నా మాటకు తిరుగులేదు.. మీడియా కథనాలు పుకార్లేనన్న ట్రంప్
ట్రంప్
news18-telugu
Updated: April 23, 2019, 8:03 PM IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలను వైట్‌హౌస్‌ అధికారులు ఖాతరు చేయడం లేదని, అధికారులెవ్వరూ ఆయన్ను పట్టించుకోవడం లేదని కొన్ని రోజులుగా ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాలపై స్పందించిన ట్రంప్ తన మాటకు తిరుగులేదని, ఎవరూ తన ఆదేశాలను ధిక్కరించడం లేదని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలన్నీ పుకార్లేనని తెలిపారు. సోమవారం ఈస్టర్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ‘మీ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదంటగా’ అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. అభిశంసన ఎదుర్కొంటున్నారా? అని అడగ్గా కొంచెం కూడా లేదని తెలిపారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో కలిసి కుట్ర చేయలేదని రాబర్ట్ ముల్లర్ నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు దర్యాప్తు చేసి ముల్లర్ ఆ నివేదికను రూపొందించారు.ఇందులో భాగంగా ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన సహాయకుల మీద కోర్టులో విచారణ జరిగింది. కొందరు జైలు శిక్షకు కూడా గురయ్యారు. ట్రంప్ నేరం చేసినట్లు తన నివేదిక నిర్ధారించడం లేదని, అలా అని ఆయన్ను ఆరోపణల నుంచి నిర్దోషిగా విముక్తి కల్పించలేమని ముల్లర్ తన నివేదికలో పేర్కొన్నారు.అయితే, పూర్తి నివేదికను త్వరలో విడుదల చేస్తానని.. కానీ అందులోని కొన్ని అంశాలు ఆంక్షలకు లోబడి ఉన్నాయని అంటూ తెలిపారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...