రోడ్డుపై చెల్లా చెదురుగా కరెన్సీ నోట్లు... ఎక్కడ... ఎందుకు... ఎలా?

ఒకరి దరిద్రం... చాలా మంది అదృష్టం అయ్యింది. హైవేపై వెళ్తున్న ట్రక్ నుంచీ కిందపడిన కరెన్సీ నోట్లు గాల్లో ఎగిరాయి. అంతే... ఒక్కసారిగా అక్కడ సీన్ మారిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 11, 2019, 2:23 PM IST
రోడ్డుపై చెల్లా చెదురుగా కరెన్సీ నోట్లు... ఎక్కడ... ఎందుకు... ఎలా?
నోట్లను ఏరుకుంటున్న జనం (Image : Twitter / Jumping Cousin)
  • Share this:
అది అమెరికా... జార్జియాలోని హైవే. అక్కడ ఆయుధాలు, కరెన్సీ కట్టలతో వెళ్తోంది ఓ ట్రక్. గాలి బాగా వీస్తోంది. ఆ టైంలో ట్రక్ డోర్ ఓపెన్ అయ్యింది. అంతే... అందులో కరెన్సీ నోట్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. చూస్తుండగానే... ఆ రోడ్డు మొత్తం నోట్ల వర్షం కురిసింది. ఇతర వాహనాల్లో వెళ్తున్న డ్రైవర్లంతా... వాహనాలు ఆపేసి... నోట్లను పట్టుకునేందుకు పరుగులు పెట్టారు. ఎవరికి వాళ్లు వీలైనంత ఎక్కువ నోట్లను పట్టుకోవాలని పోటీ పడ్డారు. ఓవైపు వాళ్లు నోట్లను ఏరుకుంటుంటే... మరోవైపు గాలికి ఆ నోట్లు అలా అలా చుట్టుపక్కల గడ్డి మైదానాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్ల దర్యాప్తులో మొత్తం 15కి పైగా వాహనాల్ని రోడ్డుపైనే ఆపేసి... నోట్ల కోసం జనం పరుగులు తీసినట్లు తేలింది. పోలీసుల లెక్కల ప్రకారం మొత్తం రూ.1,19,68,075 కరెన్సీ... గాల్లో ఎగిరినట్లు తేలింది. అధికారులు, ట్రక్ సిబ్బందీ... కొన్ని వందల డాలర్ల నోట్లను మాత్రమే సేకరించగలిగారు. కానీ ప్రజలు చాలా ఎక్కువ మొత్తం పట్టుకుపోయినట్లు తెలిపారు డన్వూడీ పోలీసులు.

డబ్బు తీసుకెళ్లినవాళ్లు వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు పోలీసులు. డబ్బుపై వ్యామోహం ఉండటాన్ని తాము అర్థం చేసుకుంటున్నామన్న పోలీసులు... ఇది చోరీ కిందకే వస్తుందనీ, కాబట్టి తిరిగి ఇచ్చేయడం మంచి పద్ధతి అని అంటున్నారు.
First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు