కన్న కూతుర్ని కన్యత్వ పరీక్షలకు తీసుకెళ్లిన ర్యాప్ స్టార్...

హ్యారిస్ గురించి నెటిజన్లు తిడుతుంటే.. అతడి కూతురి పేరుతో ట్విట్టర్‌లో ఉన్న ఓ అకౌంట్ నుంచి ఆ కామెంట్స్‌కు లైక్స్ వచ్చాయి.

news18-telugu
Updated: November 7, 2019, 7:32 PM IST
కన్న కూతుర్ని కన్యత్వ పరీక్షలకు తీసుకెళ్లిన ర్యాప్ స్టార్...
ప్రతీకాత్మక చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ Nikodash/ IStock.com)
  • Share this:
అమెరికా ర్యాప్ స్టార్, గ్రామీ అవార్డును మూడుసార్లు గెలుచుకున్న క్లిఫోర్డ్ హ్యారిసన్ అత్యంత జుగుప్సాకరమైన విషయాన్ని బయటపెట్టాడు. తన కూతురిని ప్రతి పుట్టినరోజు అయిన తర్వాత గైనకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కన్యత్వ పరీక్షలు జరిపిస్తానని చెప్పాడు. ‘లేడీస్ లైక్ అజ్’ అనే కార్యక్రమంలో హ్యారిస్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘ప్రతి పుట్టిన రోజు అయిపోగానే నా కూతురు తనకు వచ్చిన గిఫ్ట్‌లను చూసి ఆనందపడుతూ ఉంటుంది. కానీ, ఆ రోజు రాత్రి నేను ఆమె గది మీద ఓ స్టిక్కర్ అంటిస్తా. రేపు ఉదయం 9.30గంటలకి గైనకాలజిస్ట్ వద్దకు వెళ్తున్నాం. అని ఆ స్టిక్కర్ మీద రాసి ఉంటుంది. నా కూతురు 16 ఏట నుంచే నీనీ పనిచేస్తున్నా. ఇప్పుడు ఆమెకి 18 ఏళ్లు. మరో విషయం ఏంటంటే.. గైనకాలజిస్ట్ ఇచ్చే రిపోర్ట్ నేను తెలుసుకోవడానికి నా కూతురు ఒప్పుకున్నట్టు సంతకం కూడా చేస్తుంది.’ అని హ్యారిస్ తెలిపాడు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాప్ స్టార్ కూతురు డేజా మీద సానుభూతి వెల్లువెత్తింది. కొందరు హ్యారిస్‌ను తిట్టిపోశారు. కన్నకూతురితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. మరికొందరు గైనకాలజిస్టులు కూడా దీనిపై స్పందించారు. అసలు కన్యత్వ పరీక్షలు చేసిన డాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు యోనిలో ఉండే చిన్న పొర ఎప్పుడైనా తొలగిపోయే అవకాశం ఉందని, శృంగారంలో పాల్గొంటేనే అది తొలగుతుందనే మూఢనమ్మకంలో ఉన్నారా? అంటూ హ్యారిస్ మీద మండిపడ్డారు.

హ్యారిస్ గురించి నెటిజన్లు తిడుతుంటే.. అతడి కూతురి పేరుతో ట్విట్టర్‌లో ఉన్న ఓ అకౌంట్ నుంచి ఆ కామెంట్స్‌కు లైక్స్ వచ్చాయి. 39 ఏళ్ల హ్యారిస్‌ గతంలో రెండుసార్లు జైలుకు వెళ్లివచ్చాడు. 2009లో కొందరి వద్ద అనధికారికంగా మెషిన్ గన్ కొనడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. అప్పుడు 9 నెలల శిక్ష అనుభవించాడు. అంతకు ముందు ఓసారి డ్రగ్స్ కేసులో పది నెలల జైలు జీవితం రుచిచూశాడు.

First published: November 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు