news18-telugu
Updated: May 16, 2020, 7:35 AM IST
రోడ్డుపై హడలెత్తించిన పెద్దపులి... వైరల్ వీడియో... (File)
అది మెక్సికోలోని జలిస్కో ఏరియా. అక్కడ ఓ చోట.... పెద్ద సైజు కుక్క కూర్చున్నట్లు కనిపించడంతో... ఆ కుక్క ఎందుకు అంత పెద్దగా ఉంది అనుకుంటూ... కార్లలో వెళ్లే వాళ్లు దాన్ని చూశారు. తీరా దగ్గరికి వచ్చాక చూస్తే... అది కుక్క కాదు... పెద్ద పులి. జనం ఆశ్చర్యపోయారు. ఇదేంటి... ఈ పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. అంతలో... ముగ్గురు వ్యక్తులు... పులి ఉన్న వైపు... తాళ్లు, కుర్చీతో పరుగులు పెడుతూ రావడాన్ని చూశారు. "అరే... వాళ్లేంటి... పెద్ద పులి దగ్గరకు ఎలాంటి భద్రతా లేకుండా డైరెక్టుగా వచ్చేస్తున్నారు... అది మీద పడి కరిస్తే... అనుకున్నారు ప్రజలు".
ఆ ముగ్గురూ పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే... అది అటూ ఇటూ పరుగులు పెట్టింది. అది చూసి జనం షాక్ అయ్యారు. అది ఎటు నుంచి ఎటు వస్తుందో, ఎవరిపై దాడి చేస్తుందో అని ఒకటే టెన్షన్. ఇంతలో ముగ్గురిలో ఒక వ్యక్తి... తాడి వేసి... పులిని పట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అది సర్కస్ పులి కావచ్చేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. జూ నుంచి పారిపోయి ఉంటుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. హైదరాబాద్... రాజేంద్రనగర్లో ఇలాగే... చిరుతపులి... రోడ్లపై పరుగులు పెట్టి... రోజంతా ప్రజలకు టెన్షన్ తెప్పించింది. అక్కడి ఓ ఫామ్హౌజ్లోకి వెళ్లిన పులి... ఆ తర్వాత అటు నుంచి ఎటో వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. దాని కోసం 16 బృందాలు రెండ్రోజులుగా గాలిస్తున్నాయి.
Published by:
Krishna Kumar N
First published:
May 16, 2020, 7:35 AM IST