• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • TRENDS STRENGTHENS CONNECT DURING SANKRANTI FESTIVAL THROUGH AN INTERESTING CONSUMER CONTEST MS GH

Reliance Trends: Selfie With Sankranti Muggu పోటీలు.. మీ ఇంటి ముగ్గు.. రిలయన్స్ గిఫ్టు

Reliance Trends: Selfie With Sankranti Muggu పోటీలు.. మీ ఇంటి ముగ్గు.. రిలయన్స్ గిఫ్టు

ప్రతీకాత్మక చిత్రం

Reliance Trends Selfie With Sankranti Muggu Contest: మనదేశంలో అత్యధిక స్టోర్లు, అత్యధిక డిజైన్లు, అతిపెద్ద కలెక్షన్ తో ట్రెండీ ఫ్యాషన్స్ ను ప్రజలకు చేరువలోకి తెచ్చిన రిలయన్స్ ట్రెండ్స్ సంక్రాంతి పండుగకు.. "సెల్ఫీ విత్ సంక్రాంతి ముగ్గు" అనే పోటీలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పోటీలను నిర్వహిస్తారు.

  • News18
  • Last Updated:
  • Share this:
ఫ్యాషన్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని చెయిన్ ఆఫ్ ఔట్ లెట్స్ అంటే రిలయన్స్ ట్రెండ్స్ (Reliance Trends). మనదేశంలో అత్యధిక స్టోర్లు, అత్యధిక డిజైన్లు, అతిపెద్ద కలెక్షన్ తో ట్రెండీ ఫ్యాషన్స్ ను ప్రజలకు చేరువలోకి తెచ్చిన రిలయన్స్ ట్రెండ్స్ సంక్రాంతి పండుగకు.. "సెల్ఫీ విత్ సంక్రాంతి ముగ్గు" అనే పోటీలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలుగు లోగిళ్లలో సంక్రాంతికి కనువిందు చేసే రంగు రంగుల ముత్యాల ముగ్గుల ఇతివృత్తంతో ఈ పోటీ సాగనుంది. రంగోలి అనే నేపథ్యంలో తీసుకున్న సెల్ఫీల పోటీలు ఇప్పటికే ట్రెండింగ్ గా నిలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగైన సంక్రాంతికి జరిగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తున వాడవాడలా నిర్వహిస్తారు. రంగవల్లులు లేదా ముగ్గులు లేదా రంగోలి అని మనం పిలుచుకునే ముగ్గులతో సంక్రాంతి లక్ష్మికి తెలుగు వారు ఘనంగా స్వాగతం పలుకుతారు. కళ ఉట్టిపడేలా వేసిన డిజైన్లలో జీవం ఉట్టిపడేలా సహజత్వానికి దగ్గరగా ఉండే రంగులను నింపి .. ఇంటి ముందు సంక్రాంతి గొబ్బెమ్మలతో, చెరకు గడలు, పూల అలంకారాలతో సరికొత్తగా ఇంటి ముంగిళ్లను తెలుగువారు అలంకరిస్తారు. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా.. అంటున్న హరిదాసు కీర్తనల మధ్య, కళ్లాపి చల్లిన ముంగిట ముత్యాల ముగ్గుల మధ్య కొలువైన గొబ్బెమ్మలతో నాలుగు రోజుల సంక్రాంతిని జరుపుకోవటం మన ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి మరో హంగు జోడిస్తోంది మీ ప్రియమైన ట్రెండ్స్ స్టోర్స్.

రంగోలీ కంటెస్ట్

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ఆనవాయితీకి పెద్ద పీట వేస్తున్న రిలయన్స్ ట్రెండ్స్ ఇందులో భాగంగా పండగపూట వినూత్నమైన పోటీకి తెరతీసింది. సంక్రాంతి ముగ్గు లేదా రంగోలీ కంటెస్ట్ ను (Rangoli contest) కస్టమర్ల ముందుకు తెచ్చింది.

వాట్సప్ చేయండి..

మీ ఇంట్లోని ముగ్గు ముందు నించుని తీసుకున్న సెల్ఫీని ట్రెండ్స్ స్టోర్స్ వాట్సప్ నంబర్ కు వాట్సప్ ద్వారా పంపండి. ఇందుకు కంటెస్టంట్స్ అందరూ తమ సమీపంలోని ట్రెండ్స్ షో రూంను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన Trends Man/ Trends Woman/Trends Junior or Trends Footwear స్టోర్ లో వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది.

సంక్రాంతి ముగ్గు (ఫైల్)


జనవరి 15 వరకు పోటీలు..

జనవరి 15 వరకు కొనసాగనున్న ఈ పోటీలో భాగంగా Trends storeకు చెందిన 10 డిజిట్ల మొబైల్ నంబర్ కు పార్టిసిపెంట్లు తమ సెల్ఫీను పంపాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా విజేతలను ఎంపిక చేసి వారికి 2,500 రూపాయల విలువ చేసే గిఫ్ట్ ఓచర్ ను Reliance Trends బహూకరించనుంది. అంతేకాదు ఇలా పోటీలో పాల్గొన్నవారందరికీ ట్రెండ్స్ ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పనుంది. కాబట్టి మీరు వేసిన చక్కని ముగ్గుతో మీరు విజేతగా నిలిచే సదవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని ట్రెండ్స్ స్టోర్స్ ను సంప్రదించండి.

కస్టమర్లతో అనుబంధం

తమ వినియోగదారులతో ట్రెండ్స్ సంస్థ అనుబంధాన్ని మరింత బలపరచేలా ఈ సంక్రాంతి ఉత్సవాలు జోరుగా నిర్వహించేందుకు రిలయన్స్ సన్నాహాలు చేసింది. సంక్రాంతి పండుగకు సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చిన రిలయన్స్ ట్రెండ్స్ లో ట్రెండీ డిజైన్స్, సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఈ పండక్కు మీరు ఎథ్నిక్ వేర్ వేసుకోవాలన్నా, ఫ్యూజన్ లో స్టైలిష్ గా కనిపించే లుక్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలన్నా ట్రెండ్స్ లో ఫ్యాషనబుల్ కలెక్షన్ ధరించాల్సిందే. మరెందుకు ఆలస్యం మీ దగ్గర్లోని రిలయన్స్ ట్రెండ్స్ ను నేడే సందర్శించి, మీకు నచ్చిన రంగులు, మోడల్స్, డిజైన్స్, ఫ్యాషన్స్ ను సొంతం చేసుకుని మీ ఇంటి ముగ్గుతో గిఫ్ట్ సంపాదించండి. విష్ యు ఆల్ గుడ్ లక్..
Published by:Srinivas Munigala
First published:

అగ్ర కథనాలు