ఇంటర్నెట్‌లో(Internet) ఎడ్యుకేషనల్ వీడియోలు (Educational Videos) బాగా ట్రెండ్(Trend) అవుతుంటాయి. అయితే ఈ వీడియోల్లో చెప్పే ప్రతిదీ నిజం కాకపోవచ్చు. ప్రాణాలను హానికలిగించే పదార్థాలను కూడా మంచివే అని చెప్పే డేంజరస్ & ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండొచ్చు. తాజాగా ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ (TikTok)లో అలాంటి మిస్-ఇన్ఫర్మేషన్‌తో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ ట్రెండింగ్ వీడియోలో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లను (Pregnancy Test Kits) ఉపయోగించకూడని మార్గాల్లో ఉపయోగించారు. అయితే ఈ వీడియోలోలాగా ఇతరులు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ వాడితే డేంజర్‌లో పడటం ఖాయమని వైద్యులు ఇప్పుడు అందరినీ హెచ్చరిస్తున్నారు.
టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను కట్ చేశాడు. తర్వాత అందులో ఉన్న పిల్‌ని చూపించాడు. ఈ పిల్‌తో అత్యంత త్వరగా ప్రెగ్నెన్సీ పోగొట్టవచ్చు అన్నట్లుగా ఈ వీడియోకి “ప్లాన్ బీ ఇన్ ప్రెగ్నెన్సీ టెస్ట్” అనే క్యాప్షన్‌తో షాక్‌కు గురైన ఎమోజీని యాడ్ చేశాడు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ప్లాస్టిక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లో ఉన్నది నిజంగానే అత్యవసర గర్భనిరోధక మాత్ర (Emergency Contraception Pill) అని గుడ్డిగా నమ్ముతున్నారు. దీన్ని ఇతరులకు షేర్ చేసి బాగా వైరల్ కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇది పూర్తిగా అబద్ధమని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. తన సొంత టిక్‌టాక్ వీడియో ద్వారా సోషల్ మీడియా ఎడ్యుకేటర్, నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) డాక్టర్ కరణ్ రాజన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ట్రెండ్ పై స్పందించారు. ఈ వీడియోతో ఆయన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లో “ప్లాన్ బీ పిల్” ఉంటుందనే అపోహను ప్రజల్లో నుంచి తొలగించారు. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసుకునేవారు లేదా ప్రెగ్నెన్సీ నివారించడానికి ప్రయత్నించేవారు కిట్‌లో కనిపించే మాత్రను ఎట్టి పరిస్థితులలోనూ వాడకూడదని ఆయన హెచ్చరించారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లలో ఉండే మాత్రలు (Pills) ఎలాంటి బ్యాకప్ ప్లాన్ కోసం ఇవ్వలేదని కరణ్ అన్నారు. ఇది ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ పిల్ అసలే కాదని ఆయన స్పష్టం చేశారు.
“ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లలో మీకు కనిపించే టాబ్లెట్లను తినవద్దు. అవి బూట్లు, బ్యాగ్‌లలో కనిపించే చిన్న సిలికా ప్యాకెట్‌ల మాదిరిగానే పనిచేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే అవి ప్రెగ్నెన్సీ టెస్ట్ షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి తేమను గ్రహించి ఉంచడానికి ఉపయోగించే డెసికాంట్ టాబ్లెట్లు (Desiccant Tablets)," అని చెప్పారు. ఈ డెసికాంట్ టాబ్లెట్లు మనుషులకు చాలా విషపూరితమైనవని తెలిపారు. వాటిని తింటే.. పరిస్థితి విషమంగా మారకముందే వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచించారు.
Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..
"ఇలా చేయవద్దు" అనే టైటిల్ తో షేర్ చేసిన ఈ డాక్టర్ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలకొద్దీ కామెంట్లు వచ్చాయి. అతని వీడియో మరింత మంది వ్యక్తులకు చేరితే వారంతా సేవ్ అవుతారు. కొందరు నెటిజన్లు మాత్రం తాము ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌పై అందించిన ఇన్స్ట్రక్షన్స్ చదివేశామని, దీని గురించి తమకు ఆల్రెడీ తెలుసు అని చెబుతున్నారు. ఏది ఏమైనా వైద్యానికి సంబంధించి ఇంటర్నెట్ వీడియోలో కనిపించే వాటిని నిజం అని నమ్మకం పోవడమే మంచిదని ఇతర డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pregnancy, Tiktok, Trending video, Viral Video