హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: చెట్లు ఊపిరి పీల్చుకోవడం ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్

Viral Video: చెట్లు ఊపిరి పీల్చుకోవడం ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్

వైరల్ వీడియో

వైరల్ వీడియో

ViralHog YouTube ఛానెల్‌లోని ఓ వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియో చెట్టు శ్వాస తీసుకోవడం కనిపించింది. పొడవుగా ఉన్న చెట్టు..రెండుగా చీలిన దాని బెరడు ద్వారా.. గాలి తీసుకుంటోంది. దానిని చూసి చాలా మంది షాకయ్యారు.

చెట్లే పుడమికి మూలాధారం.. చెట్లే మనిషికి ప్రాణాధారం.. చెట్లు లేనిదే బతుకే లేదు. అవును .. ఈ భూమిపై మనుషులు బతికి బట్టకట్టాలంటే.. చెట్లు ఉండాలి. ఉండి తీరాలి. చెట్లు కార్భన్ డయాక్సైడ్‌ను (Corban dioxide)  తీసుకొని.. మనుషులకు ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ (Oxygen)ను విడుదల చేస్తాయి. చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఈ విషయాన్ని బోధించారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను శ్వాసిస్తాయని మనకు తెలుసు. కానీ ఆ చర్య ఎలా జరుగుతుందన్నది తెలియదు. ఎవరూ దానిని చూడలేదు. ఐతే చెట్లు ఇలా గాలి తీసుకుంటాయని ఓ వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది.

Sleeping: ప్రశాంతంగా నిద్రపోండి.. కంపెనీ నుంచి జీతం పొందండి.. దీనికి కూడా ఓ లెక్క ఉందండోయ్

ViralHog YouTube ఛానెల్‌లోని ఓ వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియో చెట్టు శ్వాస తీసుకోవడం కనిపించింది. పొడవుగా ఉన్న చెట్టు..రెండుగా చీలిన దాని బెరడు ద్వారా.. గాలి తీసుకుంటోంది. దానిని చూసి చాలా మంది షాకయ్యారు. ఏంటి ఇది నమ్మలేకపోతున్నామే అని.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అదే క్రమంలో ఎన్నో ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నారు. చెట్లు కార్భన్ డయాక్సైడ్ తీసుకుంటాయని తెలుసు గానీ.. ఇలా కాకపోవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. కొందరు దానిని చూసి భయపడ్డారు. వామ్మో.. ఇదేం వింత అని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం.. అసలు దీని వెనక ఉన్న లాజిక్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Viral: వామ్మో.. చూస్తుండగానే లోయలో పడ్డ భారీ ట్రక్.. క్లిప్పింగ్స్ వైరల్

ఈ వీడియోను కెనడా (Canada)లోని కాల్గరీలో రికార్డు చేశారు. వాస్తవానికి అక్కడ చెట్టు ఊపిరి తీసుకోవడం లేదు. బలమైన గాలుల కారణంగా అలా కనిపిస్తోంది. ఆ చెట్టు కాండం నిలువుగా కత్తిరించి ఉంది. చెట్టు లోపలి భాగం వరకు కట్ కాలేదు. కేవలం బెరడు మాత్రమే దెబ్బతింది. భారీ వర్షం, బలమైన గాలుల వల్ల అది ధ్వంసమైంది. ఆ తర్వాత కూడా బలమైన గాలులు అటు వైపు వీయడంతో.. ఆ గాలులకు చెట్టు బెరడు అటూ ఇటూ కదిలింది. దానిని చూస్తే.. అచ్చం ఊపిరి తీసుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొంతకాలం క్రితం కూడా ఓ చెట్టు వీడియో వైరల్ అయ్యింది. చెట్టు కాండం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ వీడియో కూడా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ దృశ్యాన్ని చూసి కొందరు చాలా భయపడ్డారు. దెయ్యం వల్లే ఇలా జరిగిందేమోనని ఆందోళనపడ్డారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం అలాంటివేమీ లేవని.. పిడుగుపాటు వల్ల అలా జరిగిందని చెప్పారు. చెట్టుపై పిడుగుపడడం వల్ల మంటలు చెలరేగాయని స్పష్టం చేశారు. ఉరుములు మెరుపులతో వర్షాలు పడినప్పుడు ఇలాంటివి జరుగుతాయని వెల్లడించారు.

First published:

Tags: Canada, International news, Trending, Viral Video

ఉత్తమ కథలు