హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Aravana Prasadam: అయ్యప్ప ప్రసాదం విక్రయాలు నిలిపివేత .. అవి కలుపుతున్నారని నిర్ధారించిన కేరళ హైకోర్టు

Aravana Prasadam: అయ్యప్ప ప్రసాదం విక్రయాలు నిలిపివేత .. అవి కలుపుతున్నారని నిర్ధారించిన కేరళ హైకోర్టు

Aravana Prasadam(file)

Aravana Prasadam(file)

Aravana Prasadam: శబరిమల అయ్యప్ప అరవణ పాయసం తయారిలో ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ..మోతాదుకు మించి అసురక్షిత పురుగు మందుల స్థాయి ఉందని హైకోర్టు తేల్చింది. దీంతో ప్రసాదం విక్రయం ఆపాలని బుధవారం ఆదేశించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

అయ్యప్పస్వామి భక్తులు మహా ప్రసాదంగా భావించే శబరిమల అరవణ పాయసం (Aravana Prasadam)పంపిణి నిలిపివేయాలని కేరళ హైకోర్టు (Kerala High Court)ట్రావెన్‌కోర్‌ దేవస్థానాన్ని(Travancore board)ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు బుధవారం (Wednesday)అయ్యప్పస్వామి అరవణ ప్రసాదం విక్రయాలు బుధవారం నిలిపివేశారు. అరవణ పాయసం తయారిలో ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొంది కోర్టు. ప్రసాదం రుచికి ఉపయోగించే ఏలకుల్లో అసురక్షిత పురుగు మందు(Pesticide)ల స్థాయిలపై శాంపిల్స్‌ను పరిశీలించగా అందులో ఎంఆర్‌ఎల్‌కు మించిన పురుగు మందులు ఉన్నట్లు తేలింది. ఈపరిణామాల నేపథ్యంలోనే ప్రసాదం పంపిణి నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

వసంత పంచమి రోజు అరుదైన ఆచారం.. 16 రోజుల పాటు కష్టపడి ఏంచేస్తారంటే..

ఆహార భద్రత ప్రమాణాలకు తిలోదకాలు..

కేరళకు చెందిన మనోరమ న్యూస్ కథనం ప్రకారం అరవణ పాయసంకు రుచినిచ్చేందుకు ఉపయోగించే ఏలకుల్లో నిర్దేశించిన గరిష్ఠ అవశేషాల పరిమితి (MRL) కంటే ఎక్కువగా పురుగు మందులు ఉన్నాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నిర్ధారణల ఆధారంగా ట్రావెన్‌ కోర్ దేవస్థానం బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. నాయస్థానం ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 4.45 గంటలకు కొండ గుడిలో ప్రసాదాల విక్రయాలను నిలిపివేశారు. కోర్టు ఆదేశాలతో దిగువ తిరుముట్టం, మళికప్పురంలో ప్రసాదం కౌంటర్లు మూసివేయడం భక్తులు ఒకింత నిరాశకు గురయ్యారు.

ప్రసాదంలో పురుగుల మందు..

కోర్టుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ సూచించిన విధంగా ఏలకులు లేని అరవణ పాయసం తయారీకి టీడీబీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లుగా ట్రావెన్‌కోర్‌ అధ్యక్షుడు కె.అనంతగోపాలన్ ప్రకటించారు. ముఖ్యంగా అయ్యప్ప ప్రసాదం తయారి విషయంలో కాంట్రాక్టర్ల మధ్య అనారోగ్య పోటీయే ఈ సమస్యకు కారణంగా ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు దొర్లకండా చూసుకుంటామని స్పష్టం చేసింది.

ఒక్క రోజు విక్రయాలు నిలిపివేత..

బుధవారం రాత్రి నుంచే ఉత్పత్తి ప్రారంభమవుతుందని, గురువారం నుంచి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు.సన్నిధానంలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ద్వారా ఆహార భద్రత కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రసాదం తయారు చేస్తున్నారు. 350 కిలోల బియ్యం, బెల్లం మొదలైన పదార్థాలతో కూడిన అరవణ ప్రసాదం కోసం ఒక ‘కూతు’లో 720 గ్రాముల యాలకులు మాత్రమే వినియోగిస్తున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డ్ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించుకున్నారు.

Bank Locker Rules: బ్యాంకు లాకర్లకు RBI కొత్త రూల్స్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..

నాణ్యమైన ప్రసాదం తయారి..

ప్రతి రోజూ రెండున్నర లక్షల అరవణ పాయసం డబ్బాలను ట్రావెన్ కోర్ బోర్డు తయారు చేస్తోంది.ఈ సంక్రాంతి మూడు రోజులు అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రసాదం డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే నాణ్యమైన ప్రసాదాన్ని భక్తులకు అందిచడమే తమకు ముఖ్యమని పేర్కొన్న ట్రావెన్ కోర్ బోర్డు ప్రసాదం తయారి యంత్రాలు, పరికరాలను శుభ్రం చేసిన తర్వాతే తయారి ప్రారంభించినట్లుగా తెలిపారు.

First published:

Tags: Ayyappa devotees, Kerala, National News, Sabarimala Temple

ఉత్తమ కథలు