Home /News /trending /

TRANSGENDER MAN USES PROSTHETIC GENITALS TO TRICK WOMEN INTO MATING GETS 10 YEARS PRISON PAH

ఇదేందిరా నాయన.. నకిలీ పురుషాంగంతో శృంగారం.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

United kingdom: 32 ఏళ్ల వ్యక్తి అనేక మంది మహిళలను లోబర్చుకున్నాడు.పెళ్లిపేరుతో.. వారిపైన అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధిత మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ నిజాలు వెలుగులోనికి వచ్చాయి.

కొందరు పుట్టుకతోనే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలను కల్గిఉంటారు. మరికొందరు.. ఆపరేషన్ చేసుకుని, అమ్మాయులు, అబ్బాయిల మాదిరిగా మారుతున్నారు. ఇంకొందరు అబ్బాయిలు, అమ్మాయిలుగాను మారుతున్నారు. అమాయకులను తమ వల్లో వేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాలు తెలియని వారు.. వీరిని పెళ్లి చేసుకున్న తర్వాత మోసపోయామని తెలుసుకుని లబోదిబో అంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. యూకేలో (United kingdom) అమానవీయ సంఘటన జరిగింది. 32 ఏళ్ల హన్నా వాల్టర్ తొలుత స్త్రీగా (Transgender) జన్మించింది. ఆ తర్వాత.. లింగ మార్పిడి చేసుకుని తర్జిత్ సింగ్ లా పేరు మార్చుకున్నాడు. అనేక మంది మహిళలను తన వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. కామవాంఛ తీర్చుకునే వాడు. అయితే.. అతగాడు సంభోగం సమయంలో ఆర్టిఫిషియల్ పురుషాంగాన్ని(Prosthetic Genitals)  ఉపయోగించేవాడు. ఈ విధంగా మహిళలతో సంభోగంలో (Mating)  పాల్గోనే వాడు.



అయితే ఒకరికి తెలియకుండా మరోకరితో.. ఇలా పలువురు మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. కొంత మంది పురుషులతో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో.. కొన్ని రోజుల తర్వాత బాధిత మహిళలకు తర్జిత్ సింగ్ అసలు రంగు తెలిసింది. దీంతో అతను మహిళలతో గొడవలకు దిగాడు. చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో.. వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్జిత్ సింగ్ ను అరెస్టు చేసి కోర్టులో హజరు పర్చారు.

ఇతడిపై.. యూకేలోని స్నేరెస్ బ్రూక్ క్రౌన్ కోర్టులో విచారణ చేపట్టారు. కోర్టులో కూడా తను చేసిన తప్పులపై సింగ్, పశ్చాత్తాప పడలేదు. కోర్టు వారిని కూడా మోసం చేయడానికి ప్రయత్నించాడు. అతను .. మహిళ అనే విషయాన్ని కూడా దాచడానికి ప్రయత్నించాడు. దీనిపై న్యాయమూర్తి ఆస్కార్ డెల్ ఫాబ్బ్రో.. తీవ్రంగా పరిగణించారు. నిందితుడు ఉద్దేష పూర్వకంగా మహిళలను లోబర్చుకుని అత్యాచారం, దాడులు చేసినట్లు నిరూపణ అయింది. అంతేకాకుండా నిందితులు ఏమాత్రంకూడా పశ్చాత్తాప భావనతో లేనందుకుగాను.. వీరిని వదిలేస్తే సమాజంలో ఇంకొన్ని అరాచకాలకు పాల్పడుతాడని కోర్టు భావించింది. దీంతో ఇతని నేరాలకు గాను.. 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: United Kingdom, VIRAL NEWS

తదుపరి వార్తలు