Home /News /trending /

Missing Train: వందేళ్లు అయినా మిస్టరీ వీడని ఆ ట్రైన్ మిస్సింగ్ కేసు.. ఈ కథ ఆధారంగానే ప్రభాస్ సినిమా..!

Missing Train: వందేళ్లు అయినా మిస్టరీ వీడని ఆ ట్రైన్ మిస్సింగ్ కేసు.. ఈ కథ ఆధారంగానే ప్రభాస్ సినిమా..!

Missing Train

Missing Train

Missing Train: రైలు అదృశ్యం గురించి వారు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు. సొరంగం దగ్గరికి రైలు చేసుకోగానే భీకరమైన పొగ కనిపించిందని, దాన్ని చూసి భయపడి రైలు నుంచి దూకేశామని వారు చెప్పారు.

  గాల్లో ప్రయాణించే విమానాలు ఎక్కడో కూలిపోయి అదృశ్యమైన వార్తలు.. సముద్రాల్లో అడ్రస్ లేకుండా గల్లంతైన ఓడల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రైల్వేలకు సంబంధించిన ఒక మిస్సింగ్ ట్రైన్ స్టోరీ మాత్రం వందేళ్లుగా మిస్టరీగానే మిగిలింది. వంద మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక రైలు కనిపించకుండా పోయింది. అదృశ్యమైన ఆ రైలు ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యంగానే ఉంది. ఈ సంఘటన 1911లో ఇటలీలో జరిగింది. మొత్తం 106 మందితో ప్రయాణిస్తున్న ఆ రైలు అదృశ్యమైంది. అది ఎక్కడికి వెళ్లిందనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. జనెట్టి అనే రైలు ఇటలీలోని రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే ప్రయాణ మార్గంలో ఇది ఒక కిలోమీటర్ పొడవు ఉన్న సొరంగం గుండా వెళ్లాల్సి ఉంది.

  లంబార్టీ అనే ఒక కొండను తొలిచి ఈ సొరంగాన్ని నిర్మించారు. కానీ సొరంగంలోకి ప్రవేశించిన రైలు బయటకు రాలేదు. ఆశ్చర్యకరంగా అది కనుమరుగైంది. అప్పట్లో ఆ రైలు కోసం అధికారులు వెతికినా, ఫలితం లేకుండా పోయింది. రైలుకు ప్రమాదం జరిగినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవు. సొరంగ మార్గంలో దాని అవశేషాలు సైతం ఎక్కడా కనిపించలేదు. అయితే అదే రైలులో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం సొరంగం బయట కనిపించారు.

  రైలు అదృష్యం గురించి వారు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు. సొరంగం దగ్గరికి రైలు చేసుకోగానే భీకరమైన పొగ కనిపించిందని, దాన్ని చూసి భయపడి రైలు నుంచి దూకేశామని వారు చెప్పారు. ఆ సమయంలో ఒక రకమైన వింత శబ్ధం వినిపించిందని ఒక వ్యక్తి అప్పట్లో వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆ ఇద్దరు ప్రయాణికులూ చాలా సంవత్సరాలు మానసిక సమస్యలతో సతమతమయ్యారు.

  ఈ ట్రైన్ మిస్సింగ్ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. పట్టాలపై మాత్రమే ప్రయాణించే రైలు ఎలా అదృశ్యమైంది, అది ఎక్కడికి వెళ్లింది, అందులో ప్రయాణికులు ఏమయ్యారనే వివరాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. అనంతరం జరిగిన యుద్ధంలో ఆ సొరంగం దెబ్బతినగా, దాన్ని శాశ్వతంగా మూసివేశారు.

  అయితే కొన్ని అదృశ్య శక్తులు ఈ ట్రైన్‌ను టైమ్ మెషిన్ మాదిరిగా 71 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రైలు 1840లో మెక్సికోకు చేరుకుందని మీడియా నివేదికలు వెల్లడించాయి. అప్పట్లో గుర్తించిన కొంతమంది కొత్త వ్యక్తులు వింత దుస్తులు ధరించి ఉన్నారని, చూడటానికి కొత్తగా ఉన్నారని పాత నివేదికలో ఉంది. దీంతో ఆ రైలును ‘ఘోస్ట్ ట్రైన్‌’గా పిలవడం మొదలుపెట్టారు. ఆ రైలులో దొరికిన ఒక పొగాకు పెట్టెపై ‘1907’ అని భవిష్యత్తు సంవత్సరం గురించి రాసి ఉందని, అది ఇప్పటికీ మెక్సికోలోని మ్యూజియంలో ఉందని నివేదికలు పేర్కొన్నాయి.

  ఇది కూడా చదవండి : అసలు సెల్ ఫోన్‌కు ఆ పేరు ఎలా వచ్చింది ? ఇంత స్టోరీ ఉందా ?

  ఇదే సమయంలో మెక్సికోకు చెందిన ఒక వైద్యురాలు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. తాను పనిచేస్తున్న హాస్పిటల్‌లో 104 మందిని రహస్యంగా చేర్పించారని, కానీ వారందరికీ పిచ్చి పట్టిందని ఆమె తెలిపింది. దీంతో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తరువాత ఉక్రెయిన్, క్రమియాతో పాటు ఇతర దేశాల్లో ఈ ఘోస్ట్ ట్రైన్ కనిపించిందనే వార్తలు వచ్చాయి. అయితే వందేళ్లయినా ఈ రైలు అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

  ఇది కూడా చదవండి :  చరిత్రలో గొప్ప అందగత్తె క్లియోపాత్రా సౌందర్య రహస్యం ఇదే..! ఆ ఒక్క నూనెతో..

  సాహో సినిమా తరువాత ప్రభాస్ హీరోగా వస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ ఒక మిస్టరీ ట్రైన్ ఆధారంగా తెరకెక్కుతోంది అని అంటున్నారు. ఎందుకంటే సినిమా నుంచి విడుదలై పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే ఎక్కువగా మనకి రైలు కనబడుతోంది. ఆ మధ్య టీజర్ విడుదలయిన తర్వాత సోషల్ మీడియాలో జనేట్టి ట్రైన్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనే ప్రచారం వైరల్ అయ్యింది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Italy, Prabhas, Radhe Shyam, Train

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు