Home /News /trending /

TRAFFIC RULE VIOLATORS IN GOA WILL HAVE TO PAY HIGH PENALTY FROM TOMORROW PAH

ట్రాఫిక్ రూల్స్ ని పాటించని వారికి ఇక చుక్కలే.. నేటి అర్ధరాత్రి నుంచే కఠిన నిబంధనల అమలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Traffic Rule Violators: ట్రాఫిక్ నిబంధలను అతిక్రమించే వారిపై ప్రభుత్వం కొరడా ఝాళిపించింది. ఇక వాహనంపై ఓవర్ స్పీడుతో వెళ్లేవారు, హెల్మెట్ ధరించని వారు, ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి రూల్స్ అమల్లో రానున్నాయి.

ఇంకా చదవండి ...
Goa Will Have To Pay High Penalty: గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. నేటి అర్దరాత్రి నుంచి ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, విత్ అవుట్ హెల్మెట్ డ్రైవింగ్ చేసేవారిపై కొరడా ఝాళిపించనుంది. ఈ మేరకు గోవా రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్ రాజన్ సతార్దేకర్ ప్రకారం.. కొత్త నిబంధనులు నేటి రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇది వరకే పార్లమెంట్ 2019 మోటర్ వెహికిల్ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

కొత్త బిల్లు ప్రకారం.. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ నడిపిస్తే రూ. 1,000 జరిమానా విధించడంతో పాటు మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తారు. ఒక వేళ.. పర్మిట్ లేదా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా విధిస్తారు. ఇక బీమా లేని వాహనాన్ని నడుపుతున్నప్పుడు మితిమీరిన వేగంతో వాహనం నడిపితే.. మీకు రూ. 1,000 మరియు రూ. 2,000 మధ్య జరిమానా విధించబడుతుంది. కాబట్టి ప్రజలు ఏప్రిల్ 1 నుంచి జరిమానాల బారిన పడకుండా వాహన యజమానులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు కోరారు.

Traffic Rules: గతంలో.. మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు..

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏవరైనా ట్రాఫిక్ అధికారి వాహనాన్ని ఆపి.. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే డిజిటల్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది. డిజిటల్ డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉంటే ఫిజికల్ డాక్యుమెంట్లను సదరు అధికారులు అడగకూడదు. ఒకవేళ అతడు ఏదైనా నేరం చేసినప్పటికీ ఫిజికల్ డాక్యుమెంట్లు డిమాండ్ చేయకూడదు.

ఎవరైనా వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సంబంధిత ట్రాఫిక్ అధికారి రద్దు చేస్తే ఆ వివరాలను ఆన్‌లైన్‌‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఆ రికార్డును ఎలక్ట్రానిక్‌ విధానంలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా డ్రైవర్ ప్రవర్తన తీరుపై పర్యవేక్షణ ఉంటుంది.

రోడ్డుపై ఏదైనా వాహనాన్ని ఆపి వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్స్‌ను తనిఖీ చేస్తే.. ఆ వాహన వివరాలతో పాటు తేదీ, సమయాన్ని సంబంధిత అధికారి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. తద్వారా వేరొక చోటకు వెళ్లినప్పుడు మళ్లీ ఇతర అధికారులు తనిఖీ చేసే అవసరం ఉండదు. అప్పుడు ట్రాఫిక్ సిబ్బంది సమయం వృథా కాదు. వాహనదారుడికీ ఇబ్బందులు తప్పుతాయి.

వాహనదారులు తమ వాహన పత్రాలనున కేంద్ర ప్రభుత్వ పోర్టల్ అయిన డిజి లాకర్ (Digi-locker) లేదా ఎం-పరివాహన్‌ (m-parivahan)లో నమోదు చేసుకోవచ్చు. వాటిని ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవడం వల్ల ఫిజికల్ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. రోడ్డుపై ఎవరైనా ట్రాఫిక్ అధికారులు ఆపి పత్రాలు అడితే.. ఆన్‌లైన్‌లో చూపిస్తే సరిపోతుంది.

వాహనాన్ని నడుపుతున్న సమయంలో కేవలం నేవిగేషన్ (రూట్ మ్యాప్) కోసమే మొబైల్ ఫోన్లను వినియోగించాల్సి ఉంటుంది. అది కూడా డ్రైవింగ్‌లో డ్రైవర్ ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా ఉండకూడదు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Goa, Traffic police, Traffic rules

తదుపరి వార్తలు