అమ్మాయి అందంగా ఉందని ట్రాఫిక్ ఛలానా రాసిన పోలీస్.. ఆమెను ఇంప్రెస్ చేయబోయి..

ఓ యువతి బైక్‌పై వెళ్తుండగా అడ్డగించిన పోలీస్.. ఆమెను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. వెంటనే ఛలానా బుక్ తీసి రోడ్డుపై అతి అందం(excessive beauty on public roads) అని ఫైన్ వేశాడు. పైగా, అబ్జర్వేషన్ సెక్షన్‌లో I LOVE YOU అని రాశాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 1:16 PM IST
అమ్మాయి అందంగా ఉందని ట్రాఫిక్ ఛలానా రాసిన పోలీస్.. ఆమెను ఇంప్రెస్ చేయబోయి..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 1:16 PM IST
హెల్మెట్ పెట్టుకోకపోతేనో.. సీటు బెల్ట్ పెట్టుకోకపోతేనో.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తేనో ఫైన్ విధించడం కామన్. కానీ ఓ ట్రాఫిక్ పోలీసు ఓ అమ్మాయి అందంగా ఉందని ఛలానా విధించారు. వినడానికి వింతగా ఉన్నా అది నిజం. ఈ వింత ఘటన ఉరుగ్వేలో మే 25న చోటుచేసుకుంది. ఓ యువతి బైక్‌పై వెళ్తుండగా అడ్డగించిన పోలీస్.. ఆమెను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. వెంటనే ఛలానా బుక్ తీసి రోడ్డుపై అతి అందం(excessive beauty on public roads) అని ఫైన్ వేశాడు. పైగా, అబ్జర్వేషన్ సెక్షన్‌లో I LOVE YOU అని రాశాడు. ఆ ఛలానాను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నిమిషాల్లోనే బోలెడు లైకులు, కామెంట్లతో హోరెత్తింది. అయితే, ఛలానాపై కొందరు అతడి ధైర్యాన్ని మెచ్చుకోగా, ఇంకొందరు అధికార దుర్వినియోగం చేశాడని విమర్శిస్తున్నారు.

పోలీసు రాసిన ఛలానా (ఫేస్‌బుక్ ఫోటో)


పోలీసు ఉన్నతాధికారులు సైతం అతడి శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. అధికార పత్రాన్ని అనధికార అవసరాలకు వాడుకున్నాడని అన్నారు. ఈ ఘటనలో ఆ పోలీసు దోషి అని తేలితే.. సస్పెండ్, డిమోషన్ లేదా ట్రాఫిక్ పోలీస్ శాఖ నుంచి తీసేసే అవకాశాలున్నాయి.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...