ఈ పోలీసన్నకు సెల్యూట్.. వాహనదారుల కోసం ఏం చేశాడంటే..

Trending News: వర్షపు నీటిని తొలగించడం తన పని కాకపోయినా.. వాహనదారులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో వర్షపు నీరు మురికి కాలువలోకి వెళ్లిపోయేలా చేశాడో ట్రాఫిక్ కానిస్టేబుల్

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 26, 2019, 1:05 PM IST
ఈ పోలీసన్నకు సెల్యూట్.. వాహనదారుల కోసం ఏం చేశాడంటే..
వర్షపు నీటిని తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్వామి
  • Share this:
ఫుల్లుగా వర్షం పడింది.. ఆ ప్రాంతంలో రోడ్లన్నీ నీటిమయం అయిపోయాయి.. వాహనదారులు ఆ రోడ్డుపై వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో లేరు.. వర్షపు నీరు రోడ్లమీదే ఉండటం వల్ల ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది.. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇదంతా గమనిస్తున్నాడు.. ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకుసాగితే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని గ్రహించి తానే రంగంలోకి దూకాడు. వర్షపు నీటిని తొలగించడం తన పని కాకపోయినా.. వాహనదారులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో వర్షపు నీరు మురికి కాలువలోకి వెళ్లిపోయేలా చేశాడు.

ఈ అద్భుత సన్నివేశం హైదరాబాద్‌లోని ముషారాంబాగ్ పరిధిలో చోటుచేసుకుంది. గొప్ప పని చేసిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరు.. స్వామి. మురికి నీళ్లు.. ఛీ.. ఛీ.. అని కూడా అనుకోకుండా, తన పని కాదని వదిలేయకుండా వాటిని తొలగించిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజంగా గ్రేట్.

First published: July 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading