హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

శభాష్ పోలీసన్న... చీపురు పట్టి రోడ్డు ఊడుస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. వీడియో వైరల్..

శభాష్ పోలీసన్న... చీపురు పట్టి రోడ్డు ఊడుస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. వీడియో వైరల్..

రోడ్డుమీద ఊడుస్తున్న ట్రాఫిక్ పోలీసు

రోడ్డుమీద ఊడుస్తున్న ట్రాఫిక్ పోలీసు

Traffic Constable: ట్రాఫిక్ పోలీస్ రోడ్డు గులక రాళ్లు, కంకర పైకి తేలడం గమనించాడు. వెంటనే ఒక చీపురు పట్టుకుని, అక్కడ అంతా ఊడుస్తు రోడ్డును శుభ్రం చేశాడు.

పోలీసంటే (Police) చాలా మంది ఎంతో పొగరుగా ఉంటారని అనుకుంటారు. కొందరు పోలీసులు.. ఇతరులతో చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. తమ అధికారాలన్ని అడ్డంపెట్టుకుని, వేరే వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఈ మధ్య మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనల్లో పోలీసులు కూడా ఉంటున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే తప్పుడు పనులు చేస్తున్నారు. కొంత మంది ఇలా చేయడం వలన డిపార్ట్ మెంట్ పరువు మొత్తం పోతుంది. కానీ మరికొందరు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ (Friendly police)  ఫాలో అవుతున్నారు.

ఎవరైన ఇబ్బందుల్లో ఉండే వెంటనే స్పందిస్తున్నారు. అదే విధంగా, బాధితులు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపట్ల సానుకూలంగా స్పందిస్తుంటారు. ఇప్పటికే హైవేలపై వాహానాలు ఆగిపోతే.. వారిని పోలీసు వాహనాల్లో తరలించడం, అనుకొని ప్రమాదాలు జరిగితే పోలీసు వాహానాల్లో ఆస్పత్రులకు తరలించడం వంటి అనేక సంఘటనలను గతంలో చూశాం. ప్రస్తుతం ఒక పోలీసు కానిస్టేబుల్ రోడ్డును ఊడుస్తు వార్తలో నిలిచారు.

పూర్తి వివరాలు.. ఒక ట్రాఫిక్ పోలీసు హైవే (Traffic constable) మీద కూడలి వద్ద చీపురు పట్టుకుని రోడ్డును శుభ్రం చేశాడు. కూడలి వద్ద రోడ్డు డ్యామేజ్ అయ్యింది. కంకర పైకి తేలింది. ఇసుక కూడా పైకి తెలింది. దీంతో కొన్ని సార్లు.. ప్రయాణికులు అదుపుతప్పి పడిపోయే ఛాన్స్ ఉంది. దీన్ని గమనించిననన ట్రాఫిక్ కానిస్టేబుల్ తానే రంగంలోనికి దిగాడు. చీపురు పట్టుకుని రోడ్డుపైన తెలిన కంకరను, ఇసుకను శుభ్రం చేశాడు. (Traffic Cop Sweeps Busy Road) రోడ్డుపైన ప్రయాణికులు ఉన్న ట్రాఫిక్ అధికారి ఏమాత్రం మోహమాట పడలేదు.

కేవలం ప్రజలకు ఇబ్బంది కలగ కూడదనే మాత్రమే ఆలోచించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను (Viral video) ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీకొందరు మీ గొప్ప తననానికి మా సెల్యూట్ సర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Traffic police, Trending video, Viral Video

ఉత్తమ కథలు