Home /News /trending /

TOURISTS RESCUE A MAN DROWNING ON A BEACH IN THE PHILIPPINES SNR

టీనేజర్‌ని కాపాడేందుకు సముద్ర అలలకు ఎదురు నిలబడ్డారు..ఎక్కడో తెలుసా..!

philippines

philippines

OMG: ఒక్కడ్ని కాపాడేందుకు పదుల సంఖ్యలో జనం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. సముద్ర అలల్లో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్న యువకుడ్ని రక్షించడానికి అంతా మానవహారంగా ఏర్పడి అతడ్ని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. ఫిలిప్పీన్స్‌లోని ఓ బీచ్‌లో ఈఘటన జరిగింది. ఈ సాహసోపేతమైన దృశ్యాలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
సముద్రతీరం(Beach)లో స్నానం చేస్తుంటే ఎంత సరదాగా ఉంటుందో..ఉరకలేసుకుంటూ వచ్చే నీటి అలల్లో చిక్కుకొని కాపాడమని అరుస్తుంటే అంతే భయంగా ఉంటుంది. మరి అలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఎవరైనా చిక్కుకుంటే ప్రాణాలు కాపాడేందుకు సాహసించే వాళ్లు ఎవరుంటారు చెప్పండి. ఉన్నారు ఫిలిప్పీన్స్‌(Philippines)లో అలాంటి సాహసపోతమైన ఘటనే ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటోంది. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే ..సముద్ర అలల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడటానికి రెస్క్యూ సిబ్బంది,(Rescue team)గజఈతగాళ్లు, సముద్రంలోని మత్స్యకారులో ముందుకు రాలేదు. బీచ్‌లో స్నానం చేస్తున్న తోటి పర్యాటకులే రెస్క్యూ సిబ్బందిగా మారారు. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పదుల సంఖ్యలో జనం తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన ఘటన ఫిలిప్పీన్స్‌(Philippines)లోని బిన్మాలే బీచ్‌(Binmaley beach)లో జరిగింది. నీటి అలల్లో చిక్కుకొని మునిగిపోతున్న 20ఏళ్ల యువకుడు కాపాడండీ అని అరవడంతో అక్కడున్న వాళ్లంతా ఆలోచనలో పడ్డారు. ఒక్కరుగా వెళ్తే కాపాడలేమని నిర్ధారించుకొని.. అక్కడున్న వాళ్లంతా ఓ మానవహారంగా ఏర్పడ్డారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని సుమారు 50మంది పర్యాటకులు(Tourists) అలలకు ఎదురుగా నిలబడి ఆ యువకుడ్ని మళ్లీ నీళ్లలో మునిగిపోకుండా పట్టుకున్నారు. నీళ్లలో మునిగిపోయిన యువకుడు ప్రాణాలతో ఉన్నట్లుగా గుర్తించిన తోటి టూరిస్టులు అతడ్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రి(Hospital)కి తరలించారు.

సముద్ర అలలతో  పోరాడిన పర్యాటకులు ..
బీచ్‌లో ఎంత హుషారుగా గడుపుతున్నప్పటికి నీళ్లలోకి దిగిన వెంటనే ప్రతి ఒక్కరిలో చెప్పలేని భయం కలుగుతుంది. అయితే ఈత వచ్చిన వాళ్లు కాస్త ధైర్యంగా ఉన్నప్పటికి సముద్రం లోపలికి వెళ్లి స్నానం చేసేందుకు సాహసించరు. సముద్రం అలలే ముందుకు వస్తుంటాయి. వాటిని గమనించకపోవడం వల్లే ఫిలిప్పీన్స్‌ బిన్మాలే బీచ్‌లో యువకుడు అలల్లో చిక్కుకుపోయాడు. అతడ్ని కాపాడేందుకు తోటి పర్యాటకులు తమ ప్రాణాలకు తెగించి సాహయం చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. ఫిలిప్పీన్స్‌ బీచ్‌లో యువకుడ్ని తోటి టూరిస్టులు గొలుసుకట్టుగా ఏర్పడి రక్షించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఒక్కడ్ని కాపాడేందుకు అంత మంది..
ఈఘటన జనవరి ఫస్ట్‌న జరిగింది. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్కడి ప్రాణం కాపాడేందుకు పదుల సంఖ్యలో రిస్క్స్ చేశారంటూ నెటిజన్లు మిగిలిన టూరిస్టులను తెగ పొగిడేస్తున్నారు. ప్రాణం విలువ తెలిసిన వాళ్లే తోటి వ్యక్తి అపాయంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి మానవత్వాన్ని చాటుకుంటారని మరికొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. నీళ్లలోంచి బయటపడిన యువకుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతంఎలా ఉందని మరికొందరు ఆరా తీస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Philippine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు