వామ్మో... పే...ద్ద హాట్ డాగ్... భలే చేశారుగా...

Hot Dog : హాట్ డాగ్ మహా అయితే అర కేజీ బరువు మించదు. అలాంటిది అది ఏకంగా 30 కేజీలు ఉంది. రికార్డ్ సృష్టించిన ఆ హాట్ డాగ్ కథేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 6, 2019, 10:11 AM IST
వామ్మో... పే...ద్ద హాట్ డాగ్... భలే చేశారుగా...
హాట్ డాగ్ (Image : Twitter / Reuters Top News)
  • Share this:
హాట్ డాగ్... విదేశాల్లో చాలా మంది ఫేవరెట్ ఫుడ్. తినడానికి చాలా టేస్టీగా... రుచికరంగా ఉండటమే కాదు... ఫాస్ట్‌గా తినేందుకు వీలయ్యే స్నాక్. అందుకే... హాట్ డాగ్ అంటే ఇష్టంగా తింటారు చాలా మంది. ప్రపంచంలోనే అతి పెద్ద హాట్ డాగ్ చెయ్యాలని సంకల్పించిన ఓ రెస్టారెంట్ టీమ్... ఏకంగా 66 పౌండ్ల (దాదాపు 30 కేజీలు) హాట్ డాగ్‌ను తయారుచేసింది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద హాట్ డాగ్ అంటున్నారు. ఇంత పెద్ద హాట్ డాగ్‌ను తినాలని ఎంతో మంది ఎదురుచూశారు. వాళ్లను కాసేపు నోరూరించిన రెస్టారెంట్ నిర్వాహకులు... ఆ తర్వాత దాన్ని చక్కగా వీడియో తీసి, ఫొటోలు తీసి... అందరికీ చూపించి... ఆ తర్వాత అందరికీ పంచిపెట్టారు. అంత పెద్దది చేసినా... టేస్ట్ ఏమాత్రం మారలేదనీ, చాలా బాగుందని చెబుతూ... లొట్టలేసుకొని తిన్నారు హాట్ డాగ్ లవర్స్.



First published: July 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>