ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు విభజనకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. 2019 జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పని ప్రారంభిస్తాయి. ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది జడ్జిలను విభజించారు. FullStory
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తెలంగాణలో రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రానికి సంబంధించి 16 అంశాలతో కూడిన మెమోరాండంను ప్రధానికి కేసీఆర్ అందజేశారు. FullStory
ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో అడుగుపెడతారని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అనంతపురంలో జరిగిన ధర్మపోరాట సభలో కేంద్రం మీద విమర్శలు గుప్పించారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేసిన తర్వాతే మోదీ రాష్ట్రానికి రావాలన్నారు.
24 గంటల్లో కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందని, వారం రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, 24 గంటల్లో ప్రభుత్వం పడిపోకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది.
యూపీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు జై కొడుతూ, ప్రధాని మోదీని తిట్టిన దివ్యాంగుడి మీద బీజేపీ నేత ప్రతాపం చూపించాడు. వికలాంగుడు అనే కనికరం కూడా లేకుండా కర్రతో చావబాదాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ నేత మీద తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.
నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఓ భారీ కుట్రను ఛేదించింది. ఐసిస్ స్ఫూర్తితో ఇండియాలో విధ్వంసాలకు పాల్పడడానికి కుట్ర చేసిన బ్యాచ్‌ను అరెస్ట్ చేసింది. ‘హర్కత్ ఉల్ హర్బ్ ఈ ఇస్లామ్’ అనే సంఘాన్ని స్థాపించి.. దాని ద్వారా దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు బ్లాస్టులు చేయాలనుకున్న వారి పన్నాగాన్ని ముందుగానే పసిగట్టింది. పది మంది నిందితులను అరెస్ట్ చేసింది.
అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. అమెరికాలోని కొలిర్‌విల్లే నగరంలో ఉన్న ఓ విల్లాలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుక్కుని నలుగురు అక్కడికక్కడే చనిపోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మెగా బ్రదర్ నాగబాబు మరోసారి బాలయ్యను టార్గెట్ చేశాడు. మరిచిపోయిన గొడవను మళ్లీ రేపాడు. గతంలో బాలకృష్ణ సారే జహాసె అచ్ఛా గీతం పాడి తీవ్ర విమర్శలపాలయ్యాడు. దీనికి కౌంటర్‌గా ఓ చిన్నపిల్లాడు సారే జహాసె అచ్ఛా అంటూ స్పష్టంగా పాడుతున్న వీడియోను నాగబాబు పోస్ట్ చేశాడు.
ట్రాయ్ ఆదేశాలతో డీటీహెచ్, కేబుల్ ధరల్లో మార్పుల వ్యవహారం ఇప్పుడు దేశమంతా పెద్ద చర్చకే దారితీస్తోంది. ఏ ఛానెల్‌కు ఎంత చెల్లించాలి? ఏఏ ప్యాకేజీ తీసుకోవాలి? ఇప్పుడు చూస్తున్న ఛానెల్స్ ఎంచుకుంటే మొత్తం ఎంత బిల్లు అవుతుంది? అన్న అనుమానాలు చాలామందికే ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకోండి.
‘బాక్సింగ్ డే’ టెస్ట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్, టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది టీమిండియా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bala Krishna Nandamuri, Chandrababu Naidu, CM KCR, High Court, Nagababu, NIA, Pm modi