దేశంలో 8 టాప్ కంపెనీలకు షాక్... డౌన్‌గ్రేడ్ చేసిన మూడీస్...

దేశంలో 8 టాప్ కంపెనీలకు షాక్... డౌన్‌గ్రేడ్ చేసిన మూడీస్... (File)

మొన్ననే భారత రేటింగ్‌ను తగ్గించేసిన మూడీస్... ఇప్పుడు భారత ప్రముఖ కంపెనీల రేటింగ్ కూడా పడేసింది. ఆ కంపెనీలు ఏవి?

 • Share this:
  ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థకు, ఇక్కడి కంపెనీలకు సమస్యగా మారుతున్నాయి. మొన్ననే ఈ సంస్థ... భారత సార్వభౌమత్వ రుణ (sovereign credit) రేటింగ్స్‌ను BAA2 నుంచి BAA3కి పడేసి... భారత్‌కి రాబోయే విదేశీ పెట్టుబడులకు బ్రేక్ పడేలా చేసింది. పైగా... భారత్ ఆర్థిక వ్యవస్థను నెగెటివ్‌లోనే కొనసాగిస్తామని తెలిపింది. తాజాగా... దేశంలో అతి పెద్ద 8 నాన్-ఫైనాన్షియల్ సంస్థలు, మూడు పెద్ద బ్యాంకుల రేటింగ్స్ తగ్గించేసింది. ఈ నాన్ ఫైనాన్షియల్ సంస్థల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, ONGC కూడా ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు... నిఫ్టీలో అత్యంత కీలక కంపెనీలుగా ఉన్నాయి.

  మూడీస్ రేటింగ్స్ తగ్గించిన సంస్థలు :
  - ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ((ONGC)
  - హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)
  - ఆయిల్ ఇండియా లిమిటె‌డ్ (OIL)
  - ఇండియన ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
  - భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)
  - పెట్రోనెట్ LNG లిమిటెడ్ (PLL)
  - టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS)
  - ఇన్ఫోసిస్ లిమిటెడ్ (Infosys)

  ఈ కంపెనీలో అవుట్‌లుక్ రేటింగ్ ఇప్పుడు నెగెటివ్‌గా ఉంది. వీటితోపాటూ... మరో మూడు నాన్-ఫైనాన్షియల్ కంపెనీలకు మూడీస్... లాంగ్ టెర్మ్ ఇష్యూయర్ రేటింగ్స్ నిర్ధారించింది. అవి
  - రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)
  - UPL కార్పొరేషన్ లిమిటెడ్ (UPL Corp)
  - జెన్‌పాక్ట్ లిమిటెడ్ (Genpact)

  టీసీఎస్, ఇన్ఫోసిస్ సార్వభౌమత్వ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్... A3 నెగెటివ్ నుంచి BAA1 నెగెటివ్‌కి పడేసింది. రిల్‌లో స్థిరత్వ రేటింగ్‌ను నెగెటివ్ అవుట్‌లుక్‌కి మార్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ఎగ్జిమ్ (EXIM) బ్యాంక్‌లపైనా నెగెటివ్ యాక్షన్ తీసుకుంది రేటింగ్స్ ఏజెన్సీ. ఇలా రేటింగ్స్ తగ్గించేయడానికి కారణం... కరోనా వైరస్ వల్ల తలెత్తే సమస్యలు నానాటికీ పెరుగుతుండటమే అని ఏజెన్సీ తెలిపింది. ఐతే... రేటింగ్స్ తగ్గించేసినంత మాత్రాన దేశీయ కంపెనీలపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చంటున్నారు. అసలు సమస్య అంతా కరోనా వల్లే అంటున్నారు ఆర్థిక వేత్తలు.
  Published by:Krishna Kumar N
  First published: